Advertisement
Google Ads BL

పవన్‌ అన్నింటికీ తెగించాడా..లేక..!


మోదీ నియంతగా మారాడు. తనకు అడ్డువచ్చిన వారిని అవినీతి నెపంతో బంతాట ఆడుకుంటున్నాడు. నిన్న శశికళ, నేడు చిదంబరం, లల్లూప్రసాద్‌ యాదవ్‌, రాబోయే రోజుల్లో నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో సోనియా, రాబర్ట్‌ వాద్రాలను, బొగ్గు, టూజీ స్పెక్ట్రం వంటి వాటిని కూడా తిరిగి తోడుతున్నాడు. ఇందిరా గాంధీని మరిపిస్తున్నాడు. ఇక మోదీ ఒక్కసారిగా రెచ్చిపోతుండటంతో ప్రతిపక్షాలలోని అవినీతి నాయకులకు వణుకుపుడుతోంది. జగన్‌ నుంచి చంద్రబాబు వరకు మోదీ కాళ్లకు సాహో అంటున్నారు. ఇక రజనీ కూడా బిజెపిని కాదని సొంతగా తమిళనాడులో పార్టీ పెట్టాలని ఉన్నా కూడా సూపర్‌స్టార్‌ కాబట్టి రెమ్యూనరేషన్‌, ఆర్ధిక వ్యవహారాలలో చాలా లొసుగులుంటాయి. వాటిని మోదీ కక్ష్యతో తిరిగితోడే అవకాశం ఉంది. 

Advertisement
CJ Advs

ఇక మోదీ మనస్తత్వం ఏమిటంటే చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే రకం. కానీ ఆయన పవన్‌ విషయంలో మౌనం వహిస్తున్నాడు. చాలా మంది పవన్‌కి అంత సీన్‌ లేదంటున్నారు కానీ పవన్‌, చిరంజీవిలు కూడా ఇప్పుడు రాజకీయ నాయకులే, మరోవైపు టాప్‌స్టార్స్‌, వారికి విలాసవంతమైన స్థలాలు, ఆస్తులు కూడా ఉంటాయి. దానిని కాదనలేం. అదే పవన్‌ని మనసులో పెట్టుకుని పవన్‌ని కాకపోయినా చిరుని ఆయన ఫ్యామిలీని రచ్చగీడ్చడం మోదీకి వెన్నతో పెట్టిన విద్య. 

ఆఫ్ట్రాల్‌ ముఖ్యమంత్రులైన జయలలిత, రాజశేఖర్‌రెడ్డిలకే భయపడిన పలువురు ఇప్పుడు పవన్‌ బిజెపిపై మండిపడుతున్న తీరును చూసి రెండే వాక్యాలు మాట్లాడుతున్నారు. ఒకటి పవన్‌ అన్నింటికీ తెగించాడు. లేదా పవన్‌ వద్ద ఎలాంటి మోసాలు, భయపడాల్సిన విషయాలు లేవు. మరి ఈ రెండింటిలో ఏది నిజమో రాబోయే ఎన్నికలలోపే మోదీ చూపిస్తాడంటున్నారు. 

Pawan Kalyan is very Honest:

Will 'Power Star' Pawan Kalyan Click At The Political Box Office?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs