రజనీ అజాతశత్రువు.. ఆయనకు స్వర్గీయ బాల్‌థాకరే నుంచి మోదీ, చిదంబరం.. ఇలా అందరితో మంచి పరిచయాలున్నాయి. దాంతో ఆయనకు రాజకీయాలలోకి రావాలని ఉన్నా కూడా పాలిటిక్స్‌లోకి వస్తే అందరూ శత్రువులుగా మారుతారని, కొందరి వాడుగా మిగిలిపోతానని భయపడుతున్నాడు. ఇక రజనీ, కమల్‌లకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరంతో మంచి సంబంధం ఉంది. గతంలో కమల్ కూడా దేశాన్ని పాలించే తమిళనాడు నాయకుడు ఆ పంచెకట్టు వ్యక్తే అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జయతో పాటు అందరికీ కోపం తెప్పించాడు.
ఇక ఆమధ్య రజనీ అయితే ఏ కారణాల వల్లనో తెలియదు కానీ చిదంబరంతో చాలా సేపు బేఠీ వేశాడు. దానిలో పరిణామంగానే మోదీ నేడు చిదంబరంపై కసి తీర్చుకుని, రజనీకి అల్టిమేటం ఇచ్చాడని విశ్లేషకులు భావించారు. కాగా ఇంతకాలం దేవుడు ఆదేశించలేదని, దేవుడు ఆదేశిస్తేనే ఈ రజనీ రాజకీయాలలోకి వస్తాడని అంటూ వచ్చాడు.
కానీ తాజాగా పరిణామాలతో రజనీలో కసి పెరిగినట్లు, తనకు అవమానం జరిగినట్లు భావిస్తున్నాడని తెలుస్తోంది. దాంతో ఆయన పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. చూద్దాం.. రేపు దేవుడు రజనీని ఆదేశాస్తాడా? లేదా? అనేది వేచిచూడాలి..!