Advertisement
Google Ads BL

మోక్షజ్ఞపై మోజుతోనే ప్రమాదం!


తాజాగా రాష్ట్ర మున్సిపల్‌ శాఖా మంత్రి నారాయణ కుమారుడు నిశిత్‌నారాయణ, ఆయన స్నేహితుడు కారు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. కాగా తన తండ్రి ప్రస్తుతం మంత్రిగా ఉన్నందువల్ల నిశిత్‌ ప్రస్తుతం నారాయణ విద్యాసంస్థలు, నారాయణ మెడికల్‌ ఆసుపత్రి వంటి కీలకమైన వాటిని పర్యవేక్షిస్తున్నాడు. కాగా ఈయనకు కూడా సినిమా పిచ్చి బాగా ఉందని సమాచారం. 

Advertisement
CJ Advs

ప్రమాదం జరిగిన రోజు రాత్రి 10 గంటల నుంచి తెలుగుదేశం నాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి నటసింహం బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞతో వారు సినిమాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారంట. మోక్షజ్ఞ తెరంగేట్రం ఏ నిర్మాత చేతుల మీదుగా జరిగినా కూడా రెండో చిత్రాన్ని నిశిత్‌ నారాయణనే నిర్మించాలనే కోరికను పలుసార్లు తన స్నేహితులతో ప్రస్తావించేవాడట. ప్రమాదం జరిగిన రోజు కూడా నిశిత్‌, ఆయన స్నేహితుడు మోక్షజ్ఞతో ఎంతో సేపు మాట్లాడారని సమాచారం. 

చివరకు అర్థరాత్రి 1గంట సమయంలో బాలయ్య స్వయంగా ఫోన్‌ చేసి మోక్షజ్ఞను ఆలస్యమైందని తిట్టడంతో మోక్షజ్ఞ అక్కడ నుంచి వెంటనే వెళ్లిపోయాడని, ఆ తర్వాత కొంత సేపటి తర్వాత నిశిత్‌, ఆయన స్నేహితుడు కారులో బయలుదేరి తీవ్ర ప్రమాదంలో మరణించారని తెలుస్తోంది. 

Nishith's death, Mokshagna's connection!:

Narayana's son who is a friend to Balakrishna's son Mokshagna wanted to launch the young man in his maiden production.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs