ఎప్పుడైతే జగన్.. ప్రధాని మోదీని కలిసి, వచ్చే రాష్ట్రపతి ఎన్నికల్లో తమ మద్దతు బిజెపి ప్రతిపాదించిన వ్యక్తికే అని తేల్చి చెప్పాడో.. అప్పటినుండి ఏపీ రాజకీయాలలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. స్వయాన తమిళనాడులో శశికళ టైపులో తనకు కూడా జైలు జీవితం తప్పదని తెలిసి, జగన్ ముందుగానే మోదీని ప్రాధేయపడినట్లుగా వార్తలు వస్తున్నాయి.
దీని ద్వారా మోదీకే లాభం అనేది స్పష్టమవుతోంది. ఎందుకంటే ఇంతకాలం కేంద్రాన్ని, రాష్ట్రంలోని టిడిపిని ప్రత్యేకహోదా విషయంలో ఇబ్బంది పెడుతున్న వైసీపీ నాయకులు, జగన్ ఇకపై అలాంటి ప్రశ్నలు, ఎదురుదాడి చేయకుండా మోదీ కట్టడి చేయగలిగారు. మరోవైపు టిడిపి అధినేత చంద్రబాబుకు కూడా నీవు కాకుంటే నాకు ఏపీలో వైసీపీ ఉందనే సంకేతాలను అందించారు.
ఇటు ఓటుకు నోటు కేసులో బాబును, ఇటు ఆదాయానికి మించిన ఆస్తులు, అవినీతి సంపాదన, మనీలాండరింగ్ వంటి కేసుల్లో ఉన్న జగన్‌ను కూడా ఒకే దెబ్బకు లొంగదీసుకున్నాడు. మొత్తానికి ఎవరెన్ని చెప్పినా జగన్‌తో భేటీ ద్వారా మోదీకే ఎక్కువ ప్రయోజనం చేకూరిందని చెప్పవచ్చు.