Advertisement
Google Ads BL

సినీగ్లామర్‌ వైపు జగన్‌ చూపు..!


వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకత తనను ముఖ్యమంత్రిని చేస్తుందనే ధీమాలో జగన్‌ ఉన్నాడు. అందుకే ఈసారి కొత్తవారైనా సరే ప్రజలకు తెలిసిన ముఖాలకు సీట్లు ఇవ్వాలనే యోచనలో జగన్‌ ఉన్నాడు. ఇంతకు ముందు జగన్‌ పార్టీలో చేరిన రాజశేఖర్‌, జీవిత దంపతులు ఆ పార్టీని వీడారు. మరలా వారు జగన్‌ పంచన చేరే అవకాశాలున్నాయి. 

Advertisement
CJ Advs

అనారోగ్యం కారణంగా దాసరి నారాయణరావుకు ప్రత్యక్ష ఎన్నికల్లో సీటు ఇవ్వకపోయినా పార్టీకి దిశానిర్ధేశకునిగా భావించి, ఆయనను మరోసారి రాజ్యసభకు పంపాలని జగన్‌ భావిస్తున్నాడు. ఇక మోహన్‌బాబును లేదా ఆయన కుటుంబంలోని వారికి కూడా సీటు ఇవ్వాలని భావిస్తున్నాడు. ఇక సుమన్‌, రమ్యకృష్ణలపై కూడా ఆయన కన్నేశాడు. పోసాని కృష్ణమురళి చూపు కూడా వైసీపీపైనే ఉంది. 

ఇప్పటికే పార్టీలో రోజా ఉంది. ఇక ఆమె గురువు, ఎంపీ, తెలుగుదేశం అసంతృప్త నేత శివప్రసాద్‌, విజయనిర్మల, సీనియర్‌ నరేష్‌, సాయికుమార్‌, కవిత, గిరిబాబు.. వంటి వారిని కూడా వైసీపీలో చేర్చుకోవాలని భావిస్తున్నాడు. మరి ఆయన ఐడియా ఏమేరకు వర్కౌట్‌ అవుతుందో చూడాలి....!

YS Jagan Eye On Cine Celebrities:

Tollywood Top Celebrities like Mohan Babu, Suman, Ramyakrishna, Sai kumar to Join YSRCP?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs