Advertisement
Google Ads BL

దంగల్ మిస్సయింది.. బాహుబలి తన్నుకుపోయింది!


బాలీవుడ్‌ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్‌ అమీర్‌ఖాన్‌ చేసిన చిన్న తప్పుకు ఇప్పుడు అతను భారీ మూల్యం చెల్లించుకున్నాడు. 'బాహుబలి-దికన్‌క్లూజన్‌'కి ముందు అమీర్‌ఖాన్‌ చిత్రాలైన 'పీకే. దంగల్‌'లు అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్‌ చిత్రాలుగా గుర్తింపు పొందాయి. ఇక 'పీకే' చిత్రాన్ని అనూహ్యంగా చైనీయులు విశేషంగా ఆదరించారు. సాధారణంగా ఇతరదేశాల చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రాలపై ఎక్కువ మక్కువ చూపే చైనీయులు 'బాహుబలి-1' కి కాకుండా 'పీకే'కు పట్టం కట్టారు. 

Advertisement
CJ Advs

ఆ తర్వాత నోట్ల రద్దు సమయంలో వచ్చిన 'దంగల్‌' చిత్రం కూడా ఇండియాలో మంచి కలెక్షన్లు సాధించింది. కానీ ఈ చిత్రాన్ని త్వరగా చైనీస్‌ బాషలోకి డబ్బింగ్‌ చేయకుండా అమీర్‌ మీనమేషాలు లెక్కిస్తూ కూర్చున్నాడు. తీరా 'బాహుబలి-ది కన్‌క్లూజన్‌' ప్రభంజనం మొదలైన తర్వాత చైనాలో ప్రమోషన్‌ను స్వయంగా చేసి 'దంగల్‌'ను చైనీస్‌లోకి డబ్‌ చేసి ఏకంగా 9వేల స్క్రీన్లలో రిలీజ్‌ చేశాడు. ఈ చిత్రానికి చైనీస్‌ 10కి గాను అందరూ 9.5 కంటే ఎక్కువ రేటింగ్స్‌ ఇచ్చారు. చైనీస్‌ చిత్రాలను కూడా తోసిరాజని ఈ చిత్రం విడుదలైన మొదటి 10రోజుల్లోనే దాదాపు 400కోట్లు వసూలు చేసింది. మరో వందకోట్లు వసూలు చేయడం ఖాయమంటున్నారు. 

ఆ లెక్కన 'దంగల్‌' కూడా 'బాహుబలి-ది కన్‌క్లూజన్‌'తో పాటు 1000కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టింది. కానీ మొదట 1000కోట్లు సాధించిన చిత్రంగా మాత్రం 'బాహుబలి-ది కన్‌క్లూజన్‌' చిత్రమే క్రెడిట్‌ కొట్టేసింది. అదే 'దంగల్‌'ను ఇంకా ముందుగా చైనీస్‌ భాషలో రిలీజ్‌ చేసి ఉంటే మొదటి 1000కోట్ల చిత్రంగా 'దంగల్‌' చరిత్ర సృష్టించి ఉండేది. మొత్తానికి ఇప్పటికీ ఇండియాలో 'బాహుబలి' హవా సాగుతుండగా, 'దంగల్‌' చైనాలో చరిత్రలను తిరగరాస్తోంది. 

Baahubali is the 1st 1000 Crores Film:

Aamir Khan’s Dangal has crossed the 1000 crore mark worldwide and has now become the second Indian film to do so after Baahubali 2. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs