Advertisement
Google Ads BL

రాజమౌళి కి నో రెస్ట్...!


బాహుబలి కోసం ఐదేళ్లు కష్టించిన జక్కన్నకు ఆ సినిమా విజయం సాధించడంతో పడిన శ్రమకి ఎంజాయ్ చేస్తున్నాడు. ఐదేళ్లుగా కుటుంబం మొత్తం బాహుబలి కోసమే శ్రమించింది. ఇక బాహుబలి సినిమా కలెక్షన్స్ సునామీ ఎంతలా వుందో ప్రతి రోజు మీడియా హైలెట్ చేస్తూనే వుంది. ఇక పది రోజుల్లో 1000 కోట్లు సాధించిన ఇండియన్ సినిమాగా బాహుబలి రికార్డ్ సృష్టించింది. బాహుబలి ప్రమోషన్స్ కంప్లీట్ చేసుకున్న రాజమౌళి తన కుటుంబంతో కలిసి భూటాన్ వెళ్లి రెండు నెలల పాటు సేద తీరుతాడని అన్నారు. అయితే రాజమౌళి భూటాన్ వెళ్లలేదని తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం అప్పుడే వర్క్ స్టార్ట్ చేసాడనే వార్తలు వినబడుతున్నాయి. బాహుబలి తర్వాత రెండు మూడు నెలలు విశ్రాంతి తీసుకుని జక్కన్న తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మొదలు పెడతాడని భావించిన వారికి రాజమౌళి ఝలక్ ఇచ్చాడు. విశ్రాంతి విరామం లేకుండా అప్పుడే నెక్స్ట్ సినిమా పనులు షురూ చేసాడట.

Advertisement
CJ Advs

ఆయన భూటాన్ వెళ్లలేదని చెప్పడానికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే రాజమౌళి తాజాగా కుటుంబంతో రాఘవేంద్రుని దర్శనం చేసుకున్నట్టు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అంటే నిజంగా రాజమౌళి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పనులు మొదలు పెట్టేసినట్టేనన్నమాట. అయితే రాజమౌళి ఒక రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కథని తయారు చేయమని తన తండ్రికి చెప్పినట్లు చెబుతున్నారు. అయితే ఆ కథ పూర్తయిన తర్వాత ఆ కథకు ఏ హీరో అయితే బావుంటుందో అనేది సెట్ చేస్తారట. ఇప్పటికే టాలీవుడ్ టాప్ హీరోస్ అంతా రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చెయ్యడానికి  తహతహలాడుతున్నారు. కానీ రాజమౌళి మదిలో మాత్రం ఇద్దరు స్టార్స్ ఉన్నారట. ఒకరు ఎన్టీఆర్ అయితే మరో హీరో సూపర్ స్టార్ మహేష్ అంట. ఎప్పటినుండో మహేష్ ని హీరోగా పెట్టి రాజమౌళి డైరెక్షన్ లో ఒక సినిమా చెయ్యాలని నిర్మాత నారాయణ భావిస్తున్నాడట.

మరి రాజమౌళి ఏ హీరోతో సినిమా మొదలెడతాడో గాని అప్పటివరకు అనేక రకాల హీరోల పేర్లు ఇలా ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. అయితే రాజమౌళి ఏ హీరోతో సినిమా చెయ్యాలన్నా రెండు నెలలు ఆగాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఉన్న హీరోలంతా ఏదో ఒక సినిమాతో మరో రెండు నెలల వరకు బిజీగానే వున్నారు. సో రాజమౌళి కథ పూర్తయ్యాక హీరోని సెట్ చేసుకుని అప్పుడు భూటాన్ వెళ్లి విశ్రాంతి తీసుకుంటాడన్నమాట. 

SS Rajamouli Next Movie Updates:

Everyone is curious to know what Rajamouli’s next project will be. According to highly reliable sources, the ace director is doing a film for KL Narayana next. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs