Advertisement
Google Ads BL

ప్రభాస్ కోసం ఈ బాలీవుడ్ చిన్నది రెడీ!


బాహుబలి చిత్ర విజయం ప్రభాస్ ని ఎక్కడో కూర్చోబెట్టింది. బాహుబలితో ప్రభాస్ రేంజ్ కూడా ఆకాశమంత పెరిగిపోయింది. టాలీవుడ్ నిర్మాతలకు అందనంత ఎత్తుకు ప్రభాస్ ఒక్కసారిగా ఎదిగిపోయాడు. బాహుబలి విజయంలో రాజమౌళి ఎంత పాత్ర పోషించాడో ప్రభాస్ దీ అంతే కీలక పాత్ర వుంది. ఇక బాహుబలి ప్రభంజనం రోజు రోజుకి పెరిగిపోతుంది. బాహుబలి విడుదలైన పది రోజుల్లోనే 1000 కోట్లు కలెక్షన్స్ సాధించి 1500 కోట్లు కొల్లగొట్టే దిశగా అడుగులు వేస్తుంది. ఇక ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి విపరీతమైన పేరొచ్చేసింది. ఇక ప్రభాస్ అయితే ఇంటర్నేషనల్ స్టార్ అయ్యాడు.

Advertisement
CJ Advs

అయితే ఇప్పుడు ప్రభాస్ సాహో చిత్రం త్వరలోనే సెట్స్ మీదకెళ్లబోతుంది. ఈ చిత్రాన్ని సుజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడిగా బాలీవుడ్ భామ ఎవరన్నా అయితే బావుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. అందులో భాగంగానే కత్రినా కైఫ్ ని ప్రభాస్ కి జోడిగా సెలెక్ట్ చేస్తున్నారనే వార్తలొస్తున్న నేపథ్యంలో మరో బాలీవుడ్ భామ ప్రభాస్ పక్కన ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోనంటుంది. బాహుబలి చూసిన తర్వాత ప్రభాస్ పక్కన నటించాలని ఉందని తన మనసులోని కోర్కెను బయటపెట్టింది బాలీవుడ్ చిన్నది అలియా భట్. తాజాగా ఆమె పేస్ బుక్ లైవ్ చాట్ లో ఈ విషయాన్నీ చెప్పుకొచ్చింది. బాహుబలి సినిమా చూసాను... ఆ సినిమా బావుంది అనే పదం సరిపోదని... ఇంకేదైనా కొత్త పదం కనిపెట్టాలని చెబుతుంది. అలాగే బాహుబలి హీరో ప్రభాస్ అంటే తనకి చాలా ఇష్టమని.... అతనితో కలిసి నటించే ఛాన్స్ వస్తే మాత్రం వదులుకోనని చెబుతుంది.

మరి బాలీవుడ్ హీరోలు బాహుబలి ని మెచ్చుకోకపోయిన బాలీవుడ్ హీరోయిన్స్ మాత్రం బాహుబలిని, ప్రభాస్ ని తెగ మెచ్చేసుకుంటున్నారు. ఒక్క అలియా భట్ మాత్రమే కాదు ఇంకా చాలామంది బాలీవుడ్ భామలు ప్రభాస్ పక్కన ఛాన్స్ వస్తే వదులుకునే స్థితిలో లేరు.

Alia Bhatt wants to work with Prabhas:

Bollywood Actress Alia Bhatt, in a Twitter Q&A session with fans, said that she's interested to work with Prabhas.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs