Advertisement
Google Ads BL

2017 ద్వితీయార్దంలో కూడా వరుస పండుగలే!


ఈ ఏడాది మొదట్లో అందరూ తమ చిత్రాలను సమ్మర్‌ స్పెషల్‌కి తేవాలని చూశారు. కానీ అవి వర్కౌట్‌ కాలేదు. కేవలం పవన్‌ 'కాటమరాయుడు', ప్రభాస్‌-రాజమౌళిల 'బాహుబలి-ది కన్‌క్లూజన్‌'లు మాత్రమే రిలీజ్‌ అయ్యాయి. అయినా కూడా వేసవి సందడి ముగిసిందే అని బాధపడనక్కరలేదు. జూన్‌23న బన్నీ-దిల్‌రాజు-హరీష్‌శంకర్‌ల 'డిజె' (దువ్వాడ జగన్నాథం) రిలీజ్‌ కానుంది. తాజాగా ఈ చిత్రం మ్యూజిక్‌టీజర్‌ను రిలీజ్‌ చేశారు. పంచెకట్టులో ఉన్న బన్నీని వెనున వైపు నుంచి చూపిస్తూ ఒక 22 సెకన్ల మ్యూజికల్‌ టీజర్‌ని విడుదల చేయగా ఇది కేవలం ఓకే అనిపిస్తోంది. 

Advertisement
CJ Advs

ఇక ఆగష్టులో మహేష్‌-మురుగదాస్‌ల 'స్పైడర్‌' విడుదలకానుంది. సెప్టెంబర్‌లో ఎన్టీఆర్‌-బాబిల 'జై లవకుశ'. సెప్టెంబర్‌ నెలాఖరులో బాలయ్య-పూరీల చిత్రం, అక్టోబర్‌లో పవన్‌-త్రివిక్రమ్‌ల చిత్రం లైన్‌లో ఉన్నాయి. గోపీచంద్ చిత్రాలు రెండు రెడీ అవుతున్నాయి. త్వరలో వాటి రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ కానుంది. ఇక నవంబర్‌లో రవితేజ నటించిన 'టచ్‌ చేసి చూడు' విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక వీటితో పాటు నితిన్‌ 'లై', నాని 'నిన్నుకోరి' చిత్రాలతో పాటు నాగార్జున నటిస్తున్న 'రాజుగారి గది2' కూడా ఈ ఏడాది ద్వితీయార్దంలోనే రానుండటంతో ఈ ఏడాది సెకండాఫ్‌లో కూడా నెలకో భారీ చిత్రం ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. 

2017 Second Half Release Movies:

Pawan Katamarayudu, Rajamouli and Prabhas Baahubali 2 movies released in 2017 Summer. DJ, SPYder, Jai lava kusha and so many movies ready to Release in 2017 second half.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs