Advertisement
Google Ads BL

ఎన్టీ ఆర్‌కి చిన్ననాటి కళ గుర్తుకొచ్చింది..!


స్వతహాగా యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌కు కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నాట్యాలపై మంచి పట్టు ఉంది. చిన్నప్పుడు ఆయన దసరా మహోత్సవాల సందర్భంగా నెల్లూరుతో పాటు పలు పట్టణాలలోని దేవాలయాల్లో నాట్యం చేసి అవార్డులు గెలుచుకున్నాడు. ఆయనకు వచ్చిన ఈ విద్య వల్లనే ఆయన సినిమాలలోని డ్యాన్స్‌లను, భంగిమలను, కష్టతరమైన స్టెప్పులను కూడా సునాయాసంగా, అందరు మెచ్చుకునేలా చేయగలుగుతున్నాడు. 

Advertisement
CJ Advs

ఇక ప్రస్తుతం ఆయన తన అన్నయ్య నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మాతగా బాబి దర్శకత్వంలో 'జై లవ కుశ' చేస్తున్నాడు. ఇందులో ఆయన జై అనే నెగటివ్‌ క్యారెక్టర్‌ను, లవకుమార్‌ అనే బ్యాంకు ఉద్యోగిగా, కుశ అనే క్లాసికల్‌ డ్యాన్సర్‌గా నటిస్తున్నాడని తెలుస్తోంది. మొదట్లో జై అనేది నెగటివ్‌ క్యారెక్టర్‌ అనే వార్తలు వచ్చినా, లవకుమార్‌ అనేది పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర అని, 'కుశ' అనేది అదుర్స్‌లోని ఆచారి తరహా పాత్ర అన్నారు. 

కానీ అది నిజం కాదని తెలుస్తోంది. మొత్తంగా ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ తన నటనతో పాటు డ్యాన్స్‌ల్లోనూ అభిమానులను ఉర్రూతలూగించానికి వస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని సెప్టెరబర్‌ 1న 'జనతా గ్యారేజీ' విడుదల తేదీనే రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఎన్టీఆర్‌ బర్త్‌డే కానుకగా ఈ చిత్రంలోని ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ కానుంది. 

Jai Lava Kusa Movie Release on 1st September 2017!:

Young Tiger NTR has a good grip on the classical dances like Kuchipudi and Bharatanatyam.  As a child he danced in the temples of Nellore and other towns during the Pestivals celebrations and won awards.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs