అల్లు అర్జున్ - హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న'డీజే.. దువ్వాడ జగన్నాధం' చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అల్లు అర్జున్ కి జోడిగా పూజా హెగ్డే నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని జూన్ 23 న విడుదల చెయ్యడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ రోజు సోమవారం సాయంత్రం 'డీజే' ఆడియో టీజర్ ని విడుదల చేస్తున్నట్లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రకటించింది. ఇప్పటికే ఫస్ట్ లుక్ టీజర్, పోస్టర్స్ తో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న డీజే ఇప్పుడు ఆడియో టీజర్ తో మరోసారి ఆకట్టుకోవడానికి రెడీ అయ్యింది.
ఇకపోతే 'డీజే' చిత్రానికి సంబందించిన ఆడియో వేడుక ఉంటుందా? లేకపోతె ఈ సినిమా కి ప్రీ రిలీజ్ ఫంక్షన్ వుంటుందా? అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ఇక ఆడియో వేడుక లేకపోయినా కొద్దీ రోజుల్లో పాటలు మార్కెట్లోకి వచ్చేస్తాయని అంటున్నారు అల్లు అర్జున్ అభిమానులు.