Advertisement
Google Ads BL

సమంతకు షాక్‌...!


త్వరలో సమంత, నాగచైతన్యలు పెళ్లి చేసుకుని ఓ ఇంటివారవుతున్న విషయం తెలిసిందే. వీరి నిశ్చితార్ధం కూడా జరిగిపోయింది. త్వరలో ఆమె మంచి ముహూర్తం చూసుకుని అక్కినేని వారి ఇంట కోడలిగా రానుంది. కాగా సమంత సోషల్‌మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటుంది. ఈమెను ట్విట్టర్‌లో ఫాలో అయ్యే వారు అధికమే. కాగా తాజాగా నాగచైతన్య నటించిన 'రారండోయ్‌ వేడుక చూద్దాం' ట్రైలర్‌ విడుదలైంది. 

Advertisement
CJ Advs

ఇందులో నాగచైతన్య 'అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం' అనే డైలాగ్‌ చెబుతాడు. ఈ డైలాగ్‌ ఇప్పుడు బాగా వైరల్‌ అయింది. ఇక తాజాగా ట్విట్టర్‌లో ఓ అభిమాని నాగచైతన్య డైలాగ్‌ను ఉద్దేశించి సమంతతో 'చూశారా.. మీకు కాబోయే శ్రీవారు అమ్మాయిలను ఎంత మాట అన్నాడో?దీనికి మీ సమాధానం ఏమిటి? అంటూ చిలిపిగా ఇబ్బందికర ప్రశ్నను వేశాడు. 

దాంతో అంతే తెలివిగా సమంత దానికి సమాధానం చెప్పింది. నాగచైతన్యకు నేనేంటో బాగా తెలుసు.. ఆయన అన్నది నా గురించి కాదు.. ఇతర అమ్మాయిల గురించి' అంటూ తెలివిగా తప్పించుకుని అక్కినేని వారి లౌక్యాన్ని బాగా వంట పట్టించుకున్నట్లు సమాధానం చెప్పింది. 

Shock to Samantha...!:

Soon, Samantha and Nagachaitanya get married. Their engagement has also happened. Soon she will be looking for a good mood and come as Akkineni's home bed. The latest release of the 'Rarandoy Veduka Chuddam' trailer was released by Nagachaitanya. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs