Advertisement
Google Ads BL

రెండు ట్రైలర్స్‌ ఆసక్తికరంగా ఉన్నాయి..!


తాజాగా నాగచైతన్య నటిస్తున్న 'రారండోయ్‌ వేడుకచూద్దాం', నిఖిల్‌ 'కేశవ' ట్రైలర్లు విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాల టీజర్లలో కాసింత కొత్తదనాన్ని చూపించిన మేకర్స్‌ ఇప్పుడు ఈ ట్రైలర్స్‌తో మంచి అంచనాలను రేకెత్తిస్తున్నారు. 'సోగ్గాడే చిన్నినాయానా' తరహాలోనే దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఎమోషన్స్‌, పెళ్లి సందడి, పల్లెటూరి కథలతో పాటు మాస్‌కు నచ్చే అంశాలను కూడా బాగా పొందుపరిచాడు. 

Advertisement
CJ Advs

కొన్ని సినిమాలు ప్రారంభమైనప్పుడు పెద్దగా ఆసక్తిని కలిగించవు. కానీ విడుదల సమయానికి అందరి అటెన్షన్‌ను చూరగొంటాయి. 'రారండోయ్‌ వేడుక చూద్దాం' అదే కోవలోకి వస్తుంది. ఈ చిత్రంలో రకుల్‌ భలే అందంగా కనిపిస్తోంది. ఈ చిత్రం నాగచైతన్యకు సోలో బ్లాక్‌ బస్టర్‌ కావడం ఖాయమంటున్నారు. ఇక డిఫరెంట్‌ చిత్రాలు చేస్తున్న నిఖిల్‌, తనకు హీరోగా తొలిబ్రేక్‌నిచ్చిన 'స్వామిరారా' దర్శకుడు సుదీర్‌ వర్మ తీసిన 'కేశవ' ట్రైలర్‌ కూడా విడుదలైంది. 

ఈ చిత్రం ఓ రివేంజ్‌డ్రామాగా, హీరోకు కుడివైపు గుండె ఉండే కాన్సెప్ట్‌తో రూపొందుతున్న సంగతి మొదటి నుండి తెలిసిందే. ఇక 'రారండోయ్‌ వేడుకచూద్దాం' ఈనెల 26న, నిఖిల్‌ 'కేశవ' 19న విడుదలకు ముస్తాబవుతున్నాయి. మొత్తానికి ఈ రెండు చిత్రాలను కళ్యాణ్‌కృష్ణ, సుధీర్‌ వర్మలు చాలా కసితో తీస్తున్నారు. 

Keshava and Raarandoyi Trailers Rocking:

Naga Chaitanya's 'Raarandoyi Veduka Chooddam' and hero Nikhil's 'Keshava' teasers were released yesterday and received good response from movie buffs. But then, which trailer stands the best of the two?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs