Advertisement
Google Ads BL

ఈ భామకు డేటింగ్‌ పై మనసు మళ్లింది..!


ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్లలో ఒకరు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' సినిమాతో పెద్ద హిట్‌ అందుకుంది. ఆ తర్వాత మెల్లగా స్టార్‌హోదా తెచ్చుకుని నేటి యంగ్‌స్టార్స్‌ సరసన నటిస్తోంది. ప్రస్తుతం ఆమె మహేష్‌ బాబు-మురుగదాస్‌ల కాంబినేషన్‌లో తెలుగు, తమిళ భాషల్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న 'స్పైడర్‌' చిత్రంలో నటించింది. తాజాగా ఆమె మాట్లాడుతూ.. మొదటి సినిమా హిట్టయ్యే సరికి గోల్డెన్‌లెగ్‌ అన్నారు. 

Advertisement
CJ Advs

ఆ తర్వాత రెండు మూడు ఫ్లాప్‌లొస్తే ఐరన్‌లెగ్‌ అని ముద్రవేశారు. మరలా ఇప్పుడు గోల్డెన్‌లెగ్‌ అంటున్నారు. కాబట్టి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక నాకు రెజీనాతో పోటీ లేదు. మేమిద్దరం మంచి స్నేహితులం. మనం ఎవ్వరినీ పోటీగా భావించకూడదు. ఇక్కడ కేవలం సక్సెస్‌ మాత్రమే మాట్లాడుతుంది. ఆరోగ్యకరమైన పోటీ ఆహ్వానించదగిన పరిణామమేనంది. ఇక ఇటీవల తాను ఓ ఇంటిని కొన్నానని, దానిని ఓ హీరో నాకు గిఫ్ట్‌గా ఇచ్చాడనే ప్రశ్నలపై ఆమె ఘాటుగానే స్పందించింది. 

నేను ఇల్లు కొన్న మాట వాస్తవం. దాని విలువ 3కోట్లు. ఎవరో నాకు దానిని గిఫ్ట్‌గా ఇస్తే నేనెందుకు బ్యాంక్‌లోన్‌ తీసుకుంటాను? ఈ వార్తలు నన్ను, మా కుటుంబ సభ్యులను బాగా బాధించింది. ఇక నాకు రణవీర్‌సింగ్‌ అంటే చాలా ఇష్టం. అవకాశం వస్తే ఆయనతో డేటింగ్‌ చేయాలని ఉంది..... అంటూ తన మనసులోని మాటలను బయటపెట్టింది. 

Rakul Preet Singh Dating With Ranveer Singh:

Rakul Preet Singh is currently one of the star heroine of Tollywood. 'Venkatadri Express' got a big hit with the movie. Subsequently, the star has gained a star status and opposes today's Youngstars. Now I like Ranveer singh. If possible, he wants to be dating with him.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs