Advertisement
Google Ads BL

వారు బాహుబలి టీమ్ ని వేలెత్తి చూపిస్తున్నారట..!


బాలీవుడ్ లో సినిమా బడ్జెట్ లో ఎక్కువ మొత్తం హీరోలే వసూలు చేస్తారు. ఇక హీరోతో పాటే హీరోయిన్ కి బాగానే ముట్టజెబుతారు సదరు నిర్మాతలు. అంతే కాకుండా విలన్ కి సపోర్టింగ్ రోల్స్ చేసిన వారికి కూడా రెమ్యునరేషన్ పరంగా గట్టిగా ముడతాయి. అసలు సినిమా బడ్జెట్ లో సగం హీరో నే తన రెమ్యునరేషన్ కింద తీసుకుంటాడని బాలీవుడ్ మీడియా డంఖా బజాయించి చెబుతున్నది. మరి 500కోట్ల క్లబ్బులో తమ సినిమాలను కూర్చోబెట్టిన బాలీవుడ్ హీరోస్ అంతలా వసూలు చేస్తుంటే.... ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది హృదయాలను కొల్లగొట్టిన 'బాహుబలి ద కంక్లూజన్' చిత్రంలో నటించిన నటీనటులు ఎంత మొత్తం వసూలు చెయ్యాలి.

Advertisement
CJ Advs

ఇండియన్ సినిమాగా ఒక తెలుగు సినిమా 1000 కోట్ల క్లబ్బుని సృష్టించి 1500  కోట్ల దిశగా పరుగులు పెడుతున్న బాహుబలిలో నటించిన నటీనటుల తీసుకున్న రెమ్యునరేషన్ ఏమంత ఎక్కువ కాదు. బాహుబలి కి ఐదేళ్లు కష్టపడిన బాహుబలి ప్రభాస్ కేవలం 25  కోట్లు తీసుకోగా... బాహుబలికి అంతర్జాతీయ గుర్తింపుతో పాటు కలెక్షన్స్ సునామి సృష్టించే సినిమాగా చెక్కిన రాజమౌళికి  అందరికన్నా ఎక్కువగా  28 కోట్లుతో పాటు కొంత లాభాలలో వాటా కూడా ఇచ్చారని టాక్. అలాగే భళ్లాల దేవుడిగా బాహుబలి చిత్రానికి వెన్నుముక్కగా నిలిచిన రాణా కి 15 కోట్లు, దేవసేనగా నటించిన అనుష్క కి 5 కోట్లు, అవంతిక, తమన్నాకి 5 కోట్లు, రాజమాత శివగామిగా మెప్పించిన రమ్యకృష్ణ కి... కట్టప్పగా కత్తిలా నటించిన సత్యరాజ్ లకు చెరో 2 .5  కోట్లు బాహుబలి నిర్మాతలు ముట్టచెప్పినట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

మరి బాహుబలి 1000 కోట్లు కొల్లగొట్టి 1500 కోట్లు సాధించే దిశగా పరుగులుపెడుతుంటే ఆ సినిమాకి పనిచేసిన టీమ్ కి మాత్రం చాలా తక్కువ రెమ్యునరేషన్స్ అందుకున్నారు. మరి బాలీవుడ్ కి మనకి ఉన్న తేడా ని ఇప్పుడు అందరూ వేలెత్తి చూపిస్తున్నారు కూడా.

Baahubali 2 Team Gets Low Remunerations!:

Buzz is that the captain of the ship, Rajamouli, pocketed Rs.28 crores while Young Rebel Star Prabhas was paid Rs.25 crores. Rana earned Rs.15 crores. Anushka with Rs.5 crores, Ramyakrishna- Rs.2.5 crores and Sathyaraj received Rs.2.50 crores.  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs