Advertisement
Google Ads BL

కుమారికి డిమాండ్ బాగా పెరిగింది!


ప్రస్తుతం టాలీవుడ్ లో గ్లామర్ డాల్ గా వెలుగొందుతున్న భామ హెబ్బా పటేల్. హెబ్బకి 'కుమారి 21 ఎఫ్' లో చేసిన గ్లామర్ రోల్ కి మంచి పేరును తెచ్చిపెట్టి వరుసగా సినిమాలు చేసే అవకాశాన్నిచ్చింది. ఆ సినిమాతో హెబ్బా బాగా బిజీ అయిపొయింది. టాలీవుడ్ యాంగ్ హీరోలతో జోడి కడుతూ బిజీగా ఉన్న ఈ భామ అందరికన్నా ఎక్కువగా రాజ్ తరుణ్ తో నటించింది. ఇక వీరిద్దరి పెయిర్ హిట్ పెయిర్ గా కూడా మారింది. ఆమె నటించిన 'మిష్టర్' చిత్రం మిశ్రమ ఫలితాన్నిచ్చినప్పటికీ ప్రస్తుతం ఆమె చేతినిండా సినిమాలతో కళకళలాడుతుంది. 

Advertisement
CJ Advs

హెబ్బా నటించిన 'ఏంజిల్, అంధగాడు' చిత్రాలు త్వరలోనే విడుదలకు సిద్ధంగా వున్నాయి. అయితే ఇప్పుడు హెబ్బా పటేల్ కి మరొక మంచి అవకాశం వచ్చినట్లు చెబుతున్నారు. 'ఎవడే సుబ్రహ్మణ్యం, పెళ్లి చూపుల'తో హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ కొత్త చిత్రంలో హెబ్బకి ఛాన్స్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. విజయ్ దేవరకొండ - రాహుల్ సంకృత్యాయన్ కాంబినేషన్ లో తెరకెక్కే చిత్రానికి ఇద్దరు హీరోయిన్స్ కావాల్సి వుందట. ఆ ఇద్దరిలో ఒక హీరోయిన్ గా ప్రియాంకని సెలెక్ట్ చెయ్యగా మరో హీరోయిన్ గా హెబ్బా పటేల్ తీసుకోవాలని భావించి ఆమెని అప్రోచ్ అవగా హెబ్బా ఈ ప్రపోజల్ కి ఒకే చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఈ విషయం మాత్రం అధికారికంగా తెలియాల్సివుంది.

Hebah Patel Demand grew well:

Bhama Hebah Patel, who is currently glamorous doll in Tollywood. Hebah's 'Kumari 21 F' made Glam Row a good name and gave the opportunity to make films in a row. But now that hebah Patel is getting another good opportunity.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs