Advertisement
Google Ads BL

లేడీ అమితాబ్‌ ఈజ్‌ బ్యాక్‌...!


ఒకప్పుడు హీరోల పక్కన ఆడిపాడి టాప్‌స్టార్స్‌ అందరితో నటించిన లేడీ అమితాబ్‌ విజయశాంతి ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలతో ఓ ఊపు ఊపింది. హీరోయిన్‌గా బిజీగా ఉన్న సమయంలోనే 'ప్రతిఘటన, రేపటిపౌరులు' వంటి చిత్రాలలో నటించిన ఆమె లేడీ ఓరియంటెడ్‌గా చేసిన 'కర్తవ్యం'తో టాప్‌కి చేరిపోయింది. ఈమె హవా తెలుగుతో పాటు తమిళంలో కూడా కొనసాగింది. 

Advertisement
CJ Advs

ఆ తర్వాత కూడా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ వంటి అగ్రహీరోలతో చేసినా కూడా ఆమె పాత్రను కూడా పవర్‌ఫుల్‌గా మలిచేస్థాయికి ఆమె చేరింది. ఇక ఆమె నటించిన కొన్ని చిత్రాలను తమిళంలోకి డబ్‌చేసి ఆమె క్యారెక్టర్‌ను హైలైట్‌ చేస్తూ పబ్లిసిటీ, పోస్టర్స్‌ తయారు చేసేవారంటే ఆమె హవా ఏపాటిదో అర్దమవుతుంది. దీన్ని సహించలేని కొందరు ఆమెను తోక్కేసారని అంటారు. 

ఆ తర్వాత ఆమె తెలంగాణ వాదిగా మారి తెలంగాణ ఉద్యమ సమయంలో బిజెపి, టిఆర్‌ఎస్‌లతో పాటు సొంతగా ఓ పార్టీ కూడా పెట్టింది. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్నా కూడా ఆమె వార్తల్లో లేదు. కాగా ఆమె తాను నటించిన పవర్‌ఫుల్‌ చిత్రం 'ఒసేయ్‌..రాములమ్మ'కు సీక్వెల్‌ చేయాలని ఉందని ఆమధ్య చెప్పింది. మొత్తానికి ఆమె నటించే హీరోయిన్‌ ఓరియంటెడ్‌ మూవీ ఈ ఏడాది చివరలో పట్టాలెక్కే అవకాశం ఉంది. 

మరి ఒసేయ్‌ రాములమ్మకి సీక్వెల్‌ చేస్తుందా? లేక మరో పవర్‌ఫుల్‌ కథను, తన పొలిటికల్‌ ఇమేజ్‌కు పనికొచ్చే సినిమా చేస్తుందా? అనేది తేలాలి. ఇక ఈమె చిత్రాన్ని ఒకప్పటిలా ఏపీ ప్రజలు ఆదరిస్తారా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది....! 

Vijayashanthi comeback to films!:

If sources are to be believed, Vijayashanti is making all the arrangements to make a comeback to films.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs