బాలీవుడ్ చిత్రాలన్నీ వరసబెట్టి తెలుగులో రీమేక్ లు అవుతున్నాయి. ఆ రీమేక్స్ ని ఎక్కువగా తెలుగులో వెంకటేష్, పవన్ కళ్యాణ్ లే చేస్తున్నారు. ఇక ఇప్పుడు తాజాగా అక్షయ్ కుమార్ నటించిన జాలీ ఎల్లెల్బీ 2 తెలుగులో రీమేక్ చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఈ రీమేక్ లో రీమేక్ వీరుడు వెంకటేష్ నటిస్తాడని జోరుగా ప్రచారం జరుగుతున్నవేళ ఇప్పడొక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. జాలీ ఎల్లెల్బీ2 చిత్ర రీమేక్ రైట్స్ ని హారిక అండ్ హాసిని సంస్థ కొనుగోలు చేసిందట.
ఇక హారిక అండ్ హాసిని సంస్థ ఈ రీమేక్ ని కొనుగోలు చేసింది పవన్ కళ్యాణ్ కోసమట. ఇప్పుడు పవన్, త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటిస్తున్నాడు. త్రివిక్రమ్ సినిమా పూర్తవగానే పవన్ జాలీ ఎల్లెల్బీ రీమేక్ లో నటిస్తాడట. ఇక ఈ రీమేక్ కి ఇంకా డైరెక్టర్ సెట్ కాలేదట...... కాకపోతే ఈ చిత్రానికి మాటలు మాత్రం త్రివిక్రమ్ అందిస్తాడని సమాచారం అందుతుంది. ఇక త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయకపోవడానికి కారణం ఎన్టీఆర్ అని చెబుతున్నారు. త్రివిక్రమ్ కి ఎన్టీఆర్ తో కమిట్మెంట్ ఉండడంతోనే ఈ సినిమా ని డైరెక్ట్ చెయ్యడం లేదని అంటున్నారు.
అయితే జాలీ ఎల్లెల్బీ2 రీమేక్ రైట్స్ ని హారిక హాసిని సంస్థ దాదాపు కోటి డెబ్భై లక్షలు పోసి కొనుగోలు చేసినట్లు వార్తలొస్తున్నాయి. అయితే పవన్ మీద ఉన్న నమ్మకంతోనే హారిక అండ్ హాసిని సంస్థ ఇంత పెద్ద మొత్తానికి రీమేక్ రైట్స్ ని కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు.