Advertisement
Google Ads BL

పవన్ కి త్రివిక్రమ్ మీద కూడా నమ్మకం లేదా?


పవన్ ఇప్పుడు సినిమాలను యమా స్పీడ్ గా పట్టాలెక్కించి షూటింగ్ చేసేస్తున్నాడు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. అటు రాజకీయాల్లో బిజీగా ఉండడం వలనో .... సినిమాలపై పెద్దగా కాన్సంట్రేషన్ చేయలేకపోవడం వలనో తెలియదు గాని వరసబెట్టి పవన్ సినిమాలన్నీ ప్లాప్ అవుతున్నాయి. అయితే పవన్ స్వతహాగా చేసిన కొన్ని తప్పిదాల వల్లనే  సినిమాల ఫలితాలు అలా వున్నాయనే కామెంట్స్ చేస్తున్నారు చాలామంది. సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలో స్క్రిప్ట్ లో పవన్ చేతులు పెట్టి కెలకడం మూలంగానే ఆ సినిమా అంత ఘోరమైన పరాజయం పొందింది. అలాగే మొన్నామధ్యన వచ్చిన కాటమరాయుడు చిత్రం విషయంలోనూ పవన్ కొన్ని విషయాల్లో వేలు పెట్టడం వల్లే ఆ సినిమా పరాజయానికి కారణమనే మాటలు వినపడ్డాయి.

Advertisement
CJ Advs

ఇక ఇప్పుడు పవన్ - త్రివిక్రమ్ సినిమా విషయంలోనూ ఇదే తీరు జరుగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పుడు పవన్ చేసే చిత్రం పవన్ కి కంపల్సరీ హిట్ కావాలి. అయితే ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు హిట్ అవడంతో ఇప్పుడు తెరెకెక్కే చిత్రం కూడా హిట్ అవుతుందనే నమ్మకంతో పవన్ ఫ్యాన్స్ వున్నారు. కానీ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ డైరెక్ట్ చేసే చిత్రంలో కూడా షరా మామూలుగానే చేతులు పెడుతున్నట్లు.... చాలా మార్పులు చేర్పులు చేస్తున్నట్లు ప్రచారం మొదలైంది. 

ఇందులో పవన్ కి చాలా ఇష్టమైన మార్షల్ ఆర్ట్స్ కి సంబందించిన ఫైట్స్ పెట్టబోతున్నారట. ఇక డాన్స్ లు విషయంలో కూడా పవన్ వేలు పెడుతున్నాడని ప్రచారం జోరుగా జరుగుతుంది. అయితే కథ, డైరెక్షన్ విషయంలో మాత్రం పవన్ ఇన్వాల్వ్ కాకుండా అంతా త్రివిక్రమ్ కే అప్పజెప్పాడట. మరి పవన్ ఇలా కాలు వేలు పెట్టి కెలకడం అవసరమా... పవన్ కి త్రివిక్రమ్ పై నమ్మకం లేదా అందుకే ఇలా చేస్తున్నాడా... అని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు కొంతమంది. మరో వైపు పవన్ ఏది చేసినా త్రివిక్రమ్ ఆ సినిమాని హిట్ చెయ్యగలడనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మరికొందరు.  

Pawan Kalyan's Martial Arts in Trivikram Film:

Power Star Pawan Kalyan and ace director Trivikram's combo film is thought to be an out and out family entertainer.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs