Advertisement
Google Ads BL

వేడుక లో లాస్ట్ పంచ్ అదిరింది..!


అక్కినేని నాగ చైతన్య - రకుల్ ప్రీత్ జంటగా తెరకెక్కుతున్న 'రారండోయ్ వేడుక చూద్దాం' చిత్రాన్ని కళ్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని నాగార్జునే స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం పక్కా కుటుంబ కథా చిత్రంగా ఉండబోతుందని.... ఫ్యామిలిలో ఎప్పుడూ వేడుకలు జరుగుతుంటాయని అందుకే ఈ చిత్రానికి నాగార్జున 'రారండోయ్ వేడుక చూద్దాం' టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు చెప్పారు. ఈ సినిమా ఫస్ట్ లుక్  పోస్టర్స్ తోనే అందరిని ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ తో ప్రేక్షకులముందుకు వచ్చేసింది.

Advertisement
CJ Advs

ఈ ట్రైలర్ ఆద్యంతం .... తండ్రి ప్రేమకు విలువనిచ్చే కుర్రాడికి... అమ్మాయి ప్రేమ కూడా  ఎంత ముఖ్యమో తెలియజేశాడు డైరెక్టర్. అన్ని ఎమోషన్స్, యాక్షన్, ప్రేమ కలగలిపిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ 'రారండోయ్ వేడుక చూద్దాం' చిత్రం ఉండబోతుందని ట్రైలర్ చెప్పేస్తుంది. చక్కటి హావభావాలతో రకుల్ ప్రీత్ సింగ్ దగ్గర నుండి నాగ చైతన్యకి తండ్రిగా చేస్తున్న జగపతిబాబు వరకు అందరూ చక్కని నటనతో ప్రేక్షకులని అలరించబోతున్నారని ఈ ట్రైలర్ ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా పల్లెటూరి కుటుంబాలలో వేడుకలకు అద్దం పట్టేలా వుంది.

అయితే నాగార్జున చెప్పినట్టు 'రారండోయ్ వేడుక చూద్దాం' ట్రైలర్ చూస్తుంటే అయన నటించిన 'నిన్నేపెళ్లాడుతా, మన్మధుడు' కలగలిపితే ఎలా ఉంటుందో అచ్చం అలాంటి ఫీలింగే కలుగుతుంది. ఇక నాగ చైతన్య ఈ ట్రైలర్ లో చివరిగా చెప్పిన 'అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం' అనే  డైలాగ్ మాత్రం నాగార్జున మన్మధుడిలో అమ్మాయిలతో ఏ విధంగా బిహేవ్ చేస్తాడో అలానే అనిపిస్తే.. ట్రైలర్ స్టార్టింగ్ లో అన్నపూర్ణ చెప్పిన డైలాగ్స్ 'నిన్నే పెళ్లాడతా' గ్రీకు వీరుడు, నా రాకుమారుడు సాంగ్ ని తలపిస్తాయి. ఫోటోగ్రఫీ చాలా రిచ్ గా వుంది. ఇక దేవిశ్రీ మ్యూజిక్ గురించి చెప్పేదేముంది. అద్భుతమైన సాంగ్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో దేవిశ్రీ మరోసారి తన మ్యాజిక్ చూపించబోతున్నట్లు అర్ధమవుతుంది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ద్వితీయ యజ్ఞం గట్టెక్కడం ఖాయం అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని మే 26 న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

Click Here to see the Rarandoi Veduka Chudham Trailer 

Rarandoi Veduka Chudham Trailer Review:

Naga Chaitanya's latest film 'Ra Randoi...Veduka Chuddam' Produced by Nagarjuna Akkineni in Annapurna Studio banner with the blessings of Late Smt Akkineni Annapurna Directed by Kalyana Krishna Kurasala. Songs composed by Devi Sri Prasad became chart busters. The Movie Theatrical Trailer was released.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs