ప్రభాస్ బాహుబలి విజయాన్ని అమెరికాలో సేదతీరుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రభాస్ నెక్స్ట్ సినిమా సాహో కూడా సెట్స్ మీదకెళ్లడానికి రెడీగా వుంది. ఇప్పటికే సాహో టీజర్ యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న విషయం తెలిసిందే. సుజిత్ డైరెక్షన్ లో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న సాహో చిత్రంలో ప్రభాస్ కి జోడిగా ఎవరిని ఎంపిక చేయాలో తెలియక చిత్ర యూనిట్ తికమక పడుతుందట. సాహో చిత్రాన్ని తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో యువీ క్రియేషన్స్ వారు 150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఇక మూడు భాషల్లో ఈ చిత్రం నిర్మితమవుతుండడంతో మూడు భాషల్లో పరిచయమున్న హీరోయిన్ ని తీసుకుంటే బావుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. అందుకే బాలీవుడ్ భామలైతే మూడు భాషల్లో కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందని భావించి బాలీవుడ్ లోని దీపికా పదుకొనె, కత్రినా కైఫ్ లను ప్రభాస్ కి జోడిగా ఎంపిక చేద్దామనే నిర్ణయానికి చిత్ర యూనిట్ వచ్చిందట. కానీ దీపికా హాలీవుడ్ ఫిలిమ్స్ లో నటిస్తూ బాగా బిజీగా ఉండడంతో కత్రినాకి ఛాన్స్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా ప్రభాస్ కి జోడిగా కత్రినా అయితే బావుంటుందనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.
మరో పక్క ప్రభాస్ కి జోడిగా ఒక కొత్త ముఖాన్ని సెలెక్ట్ చేస్తున్నారని చెబుతున్నారు. రష్మిక మడోన్నా అనే కొత్త హీరోయిన్ ని ప్రభాస్ కి జోడిగా ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. మరి ఫైనల్ గా ప్రభాస్ కి జోడిగా ఎవరిని తీసుకుంటారో మరికొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. వచ్చేనెల 10 నుంచి సాహో చిత్రం సెట్స్ పైకి వస్తుందంటున్నారు.