Advertisement
Google Ads BL

సెల్ఫీ చూడ ముచ్చటగా ఉంది!


మెగాబ్రదర్‌ నాగబాబు తనయుడిగా, మెగాహీరోగా పరిచయమైన హీరో వరణ్‌తేజ్‌. ఆయన నటించిన తొలి చిత్రం 'ముకుంద', తర్వాత క్రిష్‌ దర్శకత్వంలో ఆయన నటించిన 'కంచె' చిత్రాలు ఆయనలోని నటుడిని బయటకుతీశాయి. విభిన్న కథా చిత్రాలు, వైవిద్యభరితమైన పాత్రలు చేయగలడనే కీర్తిని తెచ్చిపెట్టాయి. కానీ ఆ తర్వాత ఆయన మాస్‌, యాక్షన్‌ వైపు అడుగులు వేస్తూ చేసిన 'లోఫర్‌, మిస్టర్‌' చిత్రాలు కుదేలయ్యాయి. 

Advertisement
CJ Advs

కాగా ప్రస్తుతం ఈ యంగ్‌ హీరో క్రియేటివ్‌ దర్శకుడు శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాతగా సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న 'ఫిదా' చిత్రంలో నటిస్తున్నాడు. దిల్‌రాజు నిర్మిస్తున్నాడంటేనే చిత్రంలో ఏదో మంచి పాయింట్‌ ఉండే ఉంటుందని అర్ధమవుతోంది. ఇక శేఖర్‌ కమ్ముల 'అనామిక' వంటి రీమేక్‌ ఫ్లాప్‌ తర్వాత తనను తాను మరలా నిరూపించుకోవడానికి శ్రమించి ఈ చిత్రం స్టోరీని తయారు చేసుకున్నాడు. కసితో చిత్రాన్ని తీస్తున్నాడు. తెలుగులో, తమిళంలో ఎన్నో చిత్రాలలో మంచి మంచి అవకాశాలు వచ్చినా కూడా వద్దని చెప్పిన సాయిపల్లవి ఈ చిత్రంలో ఓ క్యూట్‌గర్ల్‌గా నటిస్తోంది. 

అమెరికా, తెలంగాణలకు చెందిన ఓ యువకుడు, యువతి మధ్య జరిగే అందమైన ప్రేమకథగా ఈ చిత్రం రూపొందుతోంది. కాగా ఈ చిత్రంలో సాయిపల్లవి, వరుణ్‌తేజ్‌లు కలిసి ఉన్న ఓ సెల్ఫీ ఇప్పుడు అందరికీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధించి వరుణ్‌తేజ్‌, శేఖర్‌కమ్ముల, సాయిపల్లవిలకు ఎలాంటి సక్సెస్‌ను అందిస్తుందో వేచిచూడాల్సివుంది....! 

Varun Tej and Sai Pallavi Selfie:

Fidaa Lead Pair Varun Tej and Sai Pallavi shares a beautiful selfie to assure that the movie is really worth waiting. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs