సినిమా ఫీల్డ్‌లో పరిచయాలు, వెనుక నుంచి సపోర్టింగ్, కులాలతో పాటు కమిట్‌మెంట్ కూడా చాలా ముఖ్యం. దీనికి ఉదాహరణగా పలువురిని చెప్పవచ్చు. మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ మొదట్లో నరసింహరాజుతో పాటు పలువురు హీరోల చిత్రాలలో విలన్లు పాత్రలను పోషించాడు. కానీ ఆయన ఏ హీరోలతో కలిసి నటించాడో వారు పరిశ్రమలో నిలబడలేకపోయినా, చిరు కష్టపడి మెగాస్టార్ స్థాయికి వచ్చాడు.
ఇక ఈశ్వరరావు హీరోగా నటించిన చిత్రాలలో మోహన్‌బాబు సెకండ్ హీరోగా, సపోర్టింగ్ క్యారెక్టర్లలో నటించాడు. కానీ ఆ తర్వాత మోహన్‌బాబు విలన్‌గా, హీరోగా, నిర్మాతగా కలెక్షన్ కింగ్‌గా మారాడు. తన కెరీర్ మొదట్లో సూపర్‌స్టార్ కృష్ణ కూడా రామ్మోహన్‌తో పాటు పలువురు హీరోల చిత్రాలలో సపోర్టింగ్ రోల్స్ చేశాడు. వారు కనుమరుగైనా కృష్ణ సూపర్‌స్టార్ స్థాయికి చేరుకున్నాడు. ఇక కృష్ణంరాజు కూడా అంతే.
తాజాగా మురళీమోహన్ మాట్లాడుతూ, తన కెరీర్ తొలినాళ్లలో చిరంజీవిని, ఆయన నటనను, ఆయన కళ్లను చూసి ఇతను మంచి విలన్ అవుతాడని భావించామని కానీ ఆయన తన రియల్‌స్టంట్స్, స్టెప్స్‌తో చరిత్ర సృష్టించి మెగాస్టార్ స్థాయికి ఎదిగాడని ప్రశంసించాడు.