Advertisement
Google Ads BL

మహానటి లో కుర్ర హీరోలు...!


అశ్వినీదత్ అల్లుడు నాగ్ అశ్విన్ సావిత్రి బయోపిక్ ని తెరకెక్కిస్తున్నాడు. దీనికి నిర్మాత అశ్విన్ మామగారు అశ్వినీదత్తే. ఇక ఈ చిత్రంలో సావిత్రి రోల్ కి కీర్తి సురేష్ కి భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరి సెలెక్ట్ చేశారు. జర్నలిస్ట్ కేరెక్టర్ కోసం సమంత ని సెలెక్ట్ చేసుకున్నాడు నాగ్ అశ్విన్. మరి మహానటి చిత్రంలో అసలు విషయాలను చూపిస్తాడో లేదో తెలియదు గాని ఈ సినిమా ఇంకా మొదలవ్వకముందే సంచలనాలకు తెరలేపుతుంది. సావిత్రి జీవితంలో జెమిని గణేషన్ ముఖ్య పాత్ర పోషించాడు. అందుకే 'మహానటి' చిత్రంలో సావిత్రి పాత్ర చేస్తున్న కీర్తి సురేష్ కి జోడిగా మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ ని ఎంపిక చేశారు. ఈ యువ నటుడు జెమిని గణేషన్ పాత్రని మహానటిలో పోషించబోతున్నాడు.

Advertisement
CJ Advs

ఇక జర్నలిస్ట్ పాత్ర చేస్తున్న సమంత కి జోడిగా పెళ్లి చూపులు తో హిట్ అందుకున్న హీరో విజయ్ దేవరకొండని ఎంపిక చేసినట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఒక జర్నలిస్ట్ పాత్రలో చేస్తున్న సమంత కి ఈ మూవీ లో జోడి ఉండదని భావించారు అంతా. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ ని సమంతకి జోడిగా నాగ్ అశ్విన్ ఎంపిక చేసినట్లు ప్రచారం మొదలైంది. అయితే ఈ విషయాన్నీ చిత్ర యూనిట్ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Dulquar Salman and Vijay Devarakonda in Mahanati Film:

Dulquer Salmaan to play late Tamil star Gemini Ganesan in upcoming film Mahanati
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs