విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో అక్కినేని అఖిల్ ఇప్పుడు తన రెండో సినిమా షూటింగ్ లో బాగా బిజీగా వున్నాడు. మొదటి సినిమాతో బాగా దెబ్బతిన్న అఖిల్ కి ఆ సినిమా ఛాయలు రెండో సినిమాపై పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు నాగార్జున. అందుకే నాగార్జున, అఖిల్ రెండో సినిమాపై బాగా ఫోకస్ పెట్టాడు. మూవీ స్క్రిప్ట్ దగ్గరి నుండి కాస్టింగ్ వరకూ ప్రతి విషయంలోనూ నాగార్జున చాలా కేర్ తీసుకుంటున్నాడని చెబుతున్నారు. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రానికి అఖిల్ కి జోడిగా ఇంకా హీరోయిన్ ని ఫైనల్ చెయ్యలేదు నాగార్జున.
అఖిల్ నటించిన మొదటి సినిమా అఖిల్ లో మొదట్లో బాలీవుడ్ చిన్నది అలియా భట్ ని తీసుకోవాలని అనుకున్నారు. కానీ అప్పట్లో అది సెట్ కాలేదు. మళ్ళీ ఇప్పుడు కూడా అఖిల్ రెండో సినిమా కోసం అలియా భట్ ని గట్టిగానే ట్రై చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మేఘ ఆకాష్ పేరు కూడా గట్టిగానే వినబడుతుంది. అయితే డైరెక్టర్ విక్రమ్ కుమార్ ఇంకా ఒక డెసిషన్ కి రావడంలేదట. ఇక హీరోయిన్ విషయంలో ఫైనల్ మాత్రం నాగార్జునదేనట. అందుకే ముందుగా విక్రమ్ కుమార్ ఫైనల్ చేసిన హీరోయిన్ ని మరలా నాగార్జున ఫైనల్ చెయ్యాలన్నమాట.