Advertisement
Google Ads BL

రమ్యకృష్ణ ఇంత పచ్చిగా చెప్పేసిందేంటి?


కాస్టింగ్‌ కౌచ్‌ విషయంలో ఈమధ్య మన హీరోయిన్లు ధైర్యంగా స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. సినిమాలలో అవకాశం రావాలంటే దర్శకనిర్మాతలకు, హీరోలకు అన్ని సమర్పించుకోవాల్సిందేనని తేల్చిచెబుతున్నారు. రాధికా ఆప్టే, తాప్సి, సుకన్యలు ఈ విషయంపై ఎప్పుడో పెదవి విప్పారు. ఇక శరత్‌కుమార్‌ కూతురిగా ఇండస్ట్రీకి పరిచయమైన వరలక్ష్మి శరత్‌కుమార్‌ సైతం తనను ఓ చానెల్‌ ప్రతినిధి ఎప్పుడు కలుద్దాం... అని అన్నాడని, ఆయన ఉద్దేశ్యం ఏమిటో తనకు తెలుసునని వ్యాఖ్యానించింది. కాజల్‌ నుంచి అందరూ ఈ విషయంపై తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. 

Advertisement
CJ Advs

ఇక కన్నడ నటి శృతిహరిహరన్‌ మాట్లాడుతూ, ఈ పద్దతి టాలీవుడ్‌లో ఎక్కువగా ఉందని, దాంతో అన్ని సమర్పించుకోవాల్సి వస్తుందనే బాధ, భయంతోనే తాను తెలుగులో హీరోయిన్‌గా మారడం కోసం తాపత్రయ పడటం లేదని, తెలుగుతో పోలిస్తే ఈ కల్చర్‌ కన్నడ చిత్రాలలో తక్కువేనని, కాబట్టే తాను కన్నడలోనే చిత్రాలు చేస్తానంటోంది. ఇక ఇప్పటికీ తన హవా చూపిస్తున్న 'నీలాంబరి', 'శివగామి' ఉరఫ్‌ రమ్యకృష్ణ కూడా దీనిపై స్పందించింది. అన్ని రంగాలలోలాగే సినిమా రంగంలో కూడా ఇది మామూలేనని, అడ్జస్ట్‌ అయితేనే అవకాశాలు వస్తాయంది. అలా అడ్జస్ట్‌ అయిన వారే హీరోయిన్లుగా రాణిస్తారని, కాకపోతే అడ్జస్ట్‌ అవ్వడం, కాకపోవడంలో ఎవరి ఇష్టం వారిదని తేల్చేసింది. 

తాజాగా రమ్యకృష్ణ మాటలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తన కెరీర్‌ మొదట్లో రమ్యకృష్ణకు అందరూ ఐరన్‌లెగ్‌ ముద్ర వేశారు. కానీ ఆమె జాతకాన్ని రాఘవేంద్రుడు మార్చాడు. ఇక ఆమె క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీని పెళ్లాడింది. కృష్ణవంశీ తీసిన 'ఖడ్గం' సినిమాలో ఈ కాస్టింగ్‌కౌచ్‌పై కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించాడు. కాగా రమ్యకృష్ణ వాడిన అడ్జస్ట్‌మెంట్‌ అనే పదానికి మీనింగ్‌ ఎవరికైనా సులభంగానే అర్ధమవుతోందని చెప్పాలి. తన మనసులోని భావాలను దాచుకోకుండా ఓపెన్‌గా చెప్పిన రమ్యకృష్ణపై ప్రశంసలు కురుస్తున్నాయి. 

Ramya Krishna Shocking Comments on Casting Couch:

Many heroines named Tapsee, Kajal, Varalakshmi, Radhika Apte were already noted that casting couch is happening in the Telugu Film Industry. Now Ramya Krishna made Shocking Comments on Casting Couch In Tollywood.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs