Advertisement
Google Ads BL

బాహుబలి కి పోటీ ఖాన్ లు కాదు..క్రికెటర్!


కట్టప్ప, బాహుబలిని ఎందుకు చంపాడు అనే క్యూరియాసిటీని ప్రతి ఒక్కరిలో కలుగజేసింది బాహుబలి ద కంక్లూజన్ చిత్రం. ప్రపంచంలోని ప్రతి నోటి వెంట బాహుబలి గురించే మాట్లాడుకునేలా చేసాడు రాజమౌళి. ఒక చిత్రం గురించి అంతలా చర్చ నడవడానికి మాత్రం బాహుబలి చిత్రమే శ్రీకారం చుట్టిందని చెప్పాలి. అలాగే బాలీవుడ్ చిత్రాలు విడుదలకు ముందు కూడా ఖాన్స్ నటించిన ఆయా చిత్రాల గురించి కూడా బాగానే పబ్లిసిటీ జరిగేది. కానీ బాహుబలి గురించి చెప్పుకున్నంత మరే సినిమా గురించి చెప్పుకోలేదంటే అతిశయోక్తి కాదు. ఇక  సినిమా రిలీజ్ అయ్యాక కూడా బాహుబలి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామి సృష్టిస్తోంది. బాహుబలి కలెక్షన్స్ సునామికి బాలీవుడ్ ఖాన్స్ త్రయం నోరెళ్ళబెట్టి చూస్తున్నారు. 

Advertisement
CJ Advs

ఎప్పుడూ బాలీవుడ్ హీరోల సినిమాలనే ఇండియన్ సినిమాలుగా కొనియాడిన ప్రపంచం ఇప్పుడు ఒక తెలుగు సినిమా అయిన బాహుబలిని ఇండియన్ సినిమాగా కీర్తిస్తుంటే తెలుగు వారికి ఎంతో గౌరవంగా వుంది. ఇక ఇప్పుడు బాహుబలి తర్వాత బాలీవుడ్ సినిమా గురించి జనాలు మాట్లాడుకోవడంలేదు. ఖాన్స్ త్రయం బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ చరిత్ర సృష్టించేవారు. అలాంటి వారికి బాహుబలి ఒక గుణపాఠం నేర్పింది. ఇక ఇప్పుడు బాహుబలి ని వేయినోళ్ల కీర్తించిన జనాలు మరో చిత్రంపై కూడా అంతే ఆసక్తితో ని చూపిస్తున్నారు.

అయితే ఇదేదో ఖాన్స్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం మాత్రం కాదు. అది ఒక క్రికెటర్ జీవిత చరిత్ర ఆధారంతో రూపొందుతున్న చిత్రం. సచిన్  హీరోగా సచిన్ బయోపిక్ 'సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్' పేరుతో   డైరెక్టర్ జేమ్స్ ఎరిక్సన్  ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. క్రికెట్ చరిత్రలో ప్రపంచంలోనే  రారాజుగా కీర్తింపబడిన క్రికెట్ దేవుడు సచిన్ జీవితంలో జరిగిన యదార్ధ సంఘటనలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ తోనే సంచలనాలు క్రియేట్ చేసింది. అలాగే టీజర్ తో సంచలనం సృష్టించిన 'సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్' ఇప్పుడు ఒక సాంగ్ తో కూడా హల్చల్ చేస్తుంది. 'సచిన్ సచిన్...' స్టేడియం లో అరుపుల్లా సాగే ఈ పాట అందరిలో ఉత్కంఠను రేపుతోంది. 

ఇప్పుడు బాహుబలి తర్వాత అంతగా చర్చిన్చుకుంటున్న చిత్రం మాత్రం సచిన్ దే. ఎందుకంటే సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్ చిత్రంలో సచిన్ హీరోగా నటించడం ఒక ఎత్తైతే.... సచిన్ గురించి మనకి తెలియని విషయాలను కూడా ఈ సినిమాలో చూపిస్తామని సచిన్ చెప్పడం కూడా ఈ సినిమా గురించి మాట్లాడు కోవడానికి కారణం. అందుకే ఇప్పుడు బాహుబలి తర్వాత అంతలా సచిన్ సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. సచిన్ అంటే వీరాభిమానంతో ఊగిపోయే అభిమానులు ఉన్నారు. సచిన్ క్రికెట్ లో సృష్టించిన ఒరవడి అంతా ఇంతా కాదు. అందుకే సచిన్ అంతగా అభిమానుల అభిమానము పొందాడు.

ఇక సచిన్ గురించి ఏదైనా వార్త బయటికి వచ్చింది అంటే అభిమానులు ఎంతో ఎగ్జైట్ అవుతారు. ఒకప్పుడు క్రికెట్ సామ్రాజ్యాన్ని శాసించిన సచిన్ జీవితం ఇప్పుడు సినిమా రూపంలో రాబోతుంది. మరి సచిన్ జీవితం తెరిచిన పుస్తకం వంటిది. అలాంటి సచిన్ జీవితంలో కూడా కొన్ని బయటికి తెలియని విషయాలు ఉన్నాయని... వాటిని ఈ సినిమాలో చూపెడతామని సచిన్ చెబుతున్నాడు. అంతటి క్రికెట్ దేవుడి సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఒక్క ఇండియాలోనే కాదు ప్రపంచంలోని సచిన్ అభిమానులంతా సచిన్ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కేవలం క్రికెట్ అభిమానులు మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకుడు కూడా సచిన్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్ చిత్రం మే 26 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

ఇక ఇప్పుడు బాహుబలి కి పోటీ.. ఖాన్స్ త్రయం చిత్రాలు కాదని...  క్రికెట్ దేవుడు సచిన్ నటించిన 'సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్' చిత్రమే అవుతుందని ట్రేడ్ పండితులు అంచనాలు వేస్తున్నారు.

Sachin: A Billion Dreams is compitation to Baahubali:

One of the most awaited biographical films 'Sachin: A Billion Dreams' is the Compitation to the Sensation Film Baahubali 2.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs