Advertisement
Google Ads BL

అజిత్ 'వివేగమ్' టీజర్ మాములుగా లేదు..!


అజిత్ కి అటు తమిళ్ లో ఇటు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. అజిత్ సినిమా వస్తుంది అంటే చాలు అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి. ఇప్పుడు అజిత్ తాజాగా నటిస్తున్న చిత్రం 'వివేగమ్'. ఫస్ట్ లుక్ తోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న 'వివేగమ్' చిత్ర టీజర్ తాజాగా విడుదలైంది.  ఇంటర్‌పోల్‌ అధికారిగా నటిస్తున్న అజిత్ ని పవర్ ఫుల్ యాక్షన్ కోణంలో చూపించాడు డైరెక్టర్ శివ. టెక్నాలజీని మాత్రం విస్తారంగా ఉపయోగించాడు. అజిత్ నెవెర్... ఎవర్.... గివ్ అప్ అంటూ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ ఈ సినిమాపై మరింత ఆసక్తిని, అంచనాలను పెంచేసింది. ఒరిజినల్ గెటప్ గెడ్డం, వైట్ హెయిర్ తో అజిత్ 'వివేగమ్' లో ఇరగదీస్తున్నాడు.

Advertisement
CJ Advs

సత్యజ్యోతి ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అజిత్ కి జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. అలాగే అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తున్నాడు. మరి అజిత్ తో డైరెక్టర్ శివ  తెరకెక్కించిన 'వీరం, వేదాళం' చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కూడా వీరి కాంబినేషన్ లో తెరకెక్కే 'వివేగమ్' కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవుతుందని అజిత్ ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

Click Here to see the Teaser

Thala57 Vivegam Teaser Talk:

Vivegam teaser: Thala Ajith makes a stylish entry as a spy in Vivegam. Don't miss his dialogue!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs