సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడం మాట అటుంచి ఎప్పటినుండో అభిమానులతో మీట్ అవుతానని చెప్పి దానిని వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్నాడు. కానీ అభిమానులేమో ఆయన రాజకీయాల్లోకి రావాలని బలంగా కోరుకుంటున్నారు. రజిని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే అభిమానులు ఆయనకు పూజలు చేసి పాలాభిషేకాలు చేసేస్తుంటారు. మరి తమిళనాట అంత క్రేజ్ ఉన్న రజినీ కి రాజకీయాలంటే భయమో లేకుంటే మారేదన్న కారణమో తెలియదు గాని రజినీ రాజకీయ రంగప్రవేశం గురించి మీడియాలో ఎన్ని వార్తలొస్తున్నప్పటికీ రజినీ మాత్రం స్పందించాడు.
ఇక మొన్నామధ్యన అభిమాన సంఘాలతో భేటీ అయ్యి వారితో సమావేశాలు నిర్వహించాలని రజిని అనుకున్నాడు. కానీ ఉన్నట్టుండి ఆ సమావేశాలను పోస్ట్ పోన్ చేసిన రజినీ మళ్లీ ఇప్పుడు ఈ నెల 15 నుండి 19 వరకు అభిమాన సంఘాలతో భేటీ కావాలని నిర్ణయించుకున్నాడు. ఈ సమావేశాల్లో రజినీకాంత్ పలు అంశాలు అభిమానులతో చర్చిస్తాడని తెలుస్తుంది. అయితే ఈ సమావేశాల్లో రజిని రాజకీయ రంగప్రవేశం గురించి కూడా వాడివేడి చర్చ జరగనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇక ఈ అభిమాన సంఘాల భేటీ విషయాన్ని రజిని కూతురు ఐశ్వర్య, అల్లుడు ధనుష్ లు దగ్గరుండి చూసుకుంటారట. ఇక ఈ సమావేశాల్లో రజిని అభిమానులతో సెల్ఫీలు కూడా దిగుతారనే ప్రచారం జరుగుతుంది.