Advertisement
Google Ads BL

పులి పిల్ల కి పిచ్చ కోపం వచ్చిందట..!


పవన్‌ సరసన 'కొమరం పులి'లో నటించిన హీరోయిన్‌ నికీషాపటేల్‌. ఆ చిత్రం డిజాస్టర్‌ కావడంతో ఈ అమ్మడికి సరైన అవకాశాలు రాలేదు. దాంతో అడపాదడపా సెకండ్‌గ్రేడ్‌ హీరోలతో, లోబడ్జెట్‌ చిత్రాలతో నెట్టుకొస్తోంది. అందం, ఎక్స్‌పోజింగ్‌ చేసేందుకు ఏమాత్రం అభ్యంతరం లేకపోయినా ఆమెపై ఐరన్‌లెగ్‌ ముద్రపడింది. 

Advertisement
CJ Advs

ఇక తాజాగా ఈ అమ్మడు సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను 'బాహుబలి' రెండు భాగాలను చూశానని, ఈ రెండు చిత్రాలు హాలీవుడ్‌స్థాయిలో ఉన్నాయని చెప్పి, రాజమౌళిని ఆకాశానికి ఎత్తేసింది. కాగా ఇటీవల తాను ఓ హీరోను 'బాహుబలి' చిత్రం చూశారా? డైరెక్టర్‌ భలే తీశాడుకదా..! అని అడిగానని దానికి అతను తాను ఆ చిత్రం చూడలేదని, ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు? అని అడిగాడని మండిపడింది. 

దేశచరిత్రను మార్చిన ఈ చిత్రం చూడకపోయినా కనీసం రాజమౌళి పేరు తెలియకపోవడం ఏమిటి? అందునా అలా మాట్లాడిన వ్యక్తి పరభాషా నటుడు కాదు... తెలుగు వాడేనని బాంబు పేల్చింది. ఇంతకీ ఎవరా హీరో? అని అడిగితే ఆ హీరో పేరు చెప్పను. అలాంటి వ్యక్తి పేరు నా నోటితో చెప్పడం అవమానంగా భావిస్తున్నానని అంది. మొత్తానికి ఆమె నిజంగా చెప్పిందో? లేక తాను మరలా టాలీవుడ్‌ వార్తల్లో నిలబడేందుకు చెప్పిందో తెలియదు గాని ఆ హీరో ఎవరనేది అర్ధం కాని విషయంగా మారింది. 

Nikesha Patel: Telugu hero insulted Baahubali :

According to Nikesha, she  asked one Telugu actor 'Have you watched baahubali?' He replied 'who directed that?'  The actor did not know that who directed Baahubali.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs