Advertisement
Google Ads BL

సాయిధరమ్ ఓకే, ఇప్పుడు ప్రభాస్‌ వంతు!


కొన్ని పుకార్లు ఎలా? ఎవరు? ఎందుకు? పుట్టిస్తారో కూడా అర్దంకాదు. తాజాగా సాయిధరమ్‌తేజ్‌కు నాగబాబు కూతురు, నటి నిహారికకి వివాహం అంటూ వార్తలు హల్‌చల్‌ చేశాయి. ఆ తర్వాత సాయి ఇలా పుకార్లు పుట్టించిన వారిపై విరుచుకుపడ్డాడు. కాగా ఇప్పుడు మరోవార్త టాలీవుడ్‌లో హల్‌చల్‌ చేస్తోంది. త్వరలో నయా ఇండియన్‌ సూపర్‌స్టార్‌ ప్రభాస్‌, అనుష్కలు త్వరలో వివాహం చేసుకోబోతున్నారనేది దాని సారాంశం. 

Advertisement
CJ Advs

ఒకరితో ఒకరు గత ఐదేళ్లుగా ఉండటంతో ఏర్పడిన సాన్నిహిత్యం వల్ల ఇద్దరి మధ్య మంచి అండర్‌స్టాడింగ్‌ వచ్చిందని, అందుకే 40ఏళ్లకు చేరువైన ప్రభాస్‌, 35ఏళ్ల అనుష్క ఇంకా పెళ్లి విషయం దాటవేస్తున్నారని అంటున్నారు. అనుష్క, ప్రభాస్‌ల మనస్తత్వాలు, అభిరుచులు కలిశాయని, దాంతో ప్రభాస్‌ ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు కూడా చెప్పి ఆమోదం పొందాడని అంటున్నారు. 

మరోవైపు ప్రభాస్‌ ఫ్యామిలీకి ఎంతో సన్నిహితుడైన రాజమౌళి సైతం అనుష్క చాలా మంచి నడవడిక కలిగిన అమ్మాయి అని ప్రభాస్‌ ఫ్యామిలీకి సర్టిఫికేట్‌ ఇవ్వడంతో త్వరలో వీరిద్దరు ఒకటి కాబోతున్నారని, స్క్రీన్‌పైనే కాదు..రియల్‌ లైఫ్‌లో కూడా ఈ జంట చూడముచ్చటగా ఉంటుందని వార్తలు వ్యాపిస్తున్నాయి. మరి దీనిపై ప్రభాస్‌, అనుష్కలు ఏ రేంజ్‌లో ఫైర్‌ అవుతారో వేచిచూడాల్సివుంది. 

After Sai Dharam Tej, Now Marriage Rumors on Prabhas:

After Saidharam Tej and Niharika Marriage Rumor, now The Rumors turned on Young Rebel Star, The New Super Star Prabahs and Beautyful Sweety Anushka. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs