Advertisement
Google Ads BL

ముందు 'స్పైడర్‌' పై క్లారిటీ ఇవ్వండి..!


మహేష్‌-మురుగదాస్‌ల 'స్పైడర్‌' చిత్రం ఏడాదికి పైగా సాగుతూనే ఉంది. జనవరి, ఫిబ్రవరి, చివరకు వేసవి, ఆ తర్వాత జూన్‌23.. ఇలా అన్నీ పాయె. కానీ చిత్రం ఇప్పటివరకు పూర్తికాలేదు. క్లైమాక్స్‌ను మరలా చిత్రీకరిస్తున్నారట. ఇక మహేష్‌ కేవలం రెండు మూడు వారాలలో షూటింగ్‌ పూర్తిచేయమని డైరెక్టర్ కు వార్నింగ్‌ ఇచ్చాడని కూడా వార్తలు వచ్చాయి. ఇక అంతా ఈ చిత్రం ఆగష్టు11న విడుదలవుతుందనే ఆశతో ఉన్నారు. 

Advertisement
CJ Advs

కానీ విక్రమ్‌, అజిత్‌లు పోటీలో ఉండటంతో పాటు చిత్రం ఇంకా పూర్తిగా మహేష్‌కు నచ్చలేదనే ప్రచారం జరుగుతోంది. ఇక ఈ చిత్రం దసరా బరిలోకి దిగుతుందనే వార్తలు వస్తున్నాయి. మరోపక్క మహేష్‌ కోసం కొరటాల వెయిట్‌ చేస్తున్నాడు. మహేష్‌ డేట్స్‌ ఇచ్చిన మూడే మూడు నెలల్లో తన 'భరత్‌ అనే నేను' చిత్రం పూర్తి చేయాలనుకుంటున్నాడు. పనిలో పనిగా 2018 జనవరి11న ఈ కొరటాల-మహేష్‌ల చిత్రం విడుదల కానుందనే ప్రచారం జరుగుతోంది. 

రెండు మూడేళ్ల ముందు వరకు మహేష్‌కు సంక్రాంతి బాగా కలిసొచ్చింది. 'ఒక్కడు, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, బిజినెస్‌మేన్‌' వంటి చిత్రాలన్నీ మంచి విజయం సాధించాయి. కానీ '1' (నేనొక్కడితే)తో ఈ సెంటిమెంట్‌ బ్రేక్‌ అయింది. మరి 'స్పైడర్‌' పూర్తి కాకుండానే 'భరత్‌ అను నేను' గురించి మాట్లాడటమంటే గాసిప్పే అని అర్ధమవుతోంది. 

Mahesh Fans Wants Clarity on Spyder Release:

Superstar Mahesh babu’s upcoming movie is SPYder is planning to be released, the release has been delayed. It was decided to release the movie on Aug 11th but the shooting didn’t get finished as expected.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs