నేటితరం కుర్రహీరోలు చాలాప్లాన్డ్‌గా వెళ్తున్నారు. వారి మద్య మంచిపోటీ ఉన్నప్పటికీ ఒకరికి ఒకరు సైడిచ్చుకుంటూ తమ విజ్ఞతను చాటుతున్నారు. తమ చిత్రాలు తమకే పోటీ కాకుండా ఉండాలనే ప్లానింగ్‌తో ప్రతి యంగ్‌హీరో కూడా తమ చిత్రాల మధ్య ఓ వారం రోజులు గ్యాప్ వచ్చేలా రిలీజ్ తేదీలను నిర్ణయిస్తున్నారు. మొదట ఒకవారం రిలీజ్ చేయాలని అనుకున్నా కూడా మరో చిత్రం అదే రోజున వస్తోందని తెలిస్తే భేషజాలకు పోకుండా మంచి సమయస్ఫూర్తిని చాటుతున్నారు.
ఇక మొన్నటి శుక్రవారం నవీన్ మేడారం దర్శకత్వంలో శ్రీనివాస్ అవసరాల హీరోగా బాలీవుడ్ 'హంటర్'కు రీమేక్‌గా వచ్చిన 'బాబు బాగా బిజీ' విడుదలైంది. ఇక రాబోయే శుక్రవారం అంటే మే12న మంచి ఊపులో ఉన్న శర్వానంద్ హీరోగా భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తుండగా, కొత్త దర్శకుడు చంద్రమోహన్ డైరెక్షన్‌లో వస్తోన్న 'రాధ' చిత్రం విడుదలకానుంది. ఆ తర్వాతి శుక్రవారం అంటే మే19న సూపర్‌హిట్ కాంబినేషన్ నిఖిల్-సుదీర్‌వర్మల కాంబినేషన్‌లో రూపొందుతున్న కూల్ రివేంజ్ స్టోరీ 'కేశవ' విడుదలకానుంది. ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి.
ఆ తర్వాత మే 26న సెన్సేషనల్ డైరెక్టర్ కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్‌లో నాగచైతన్య-రకుల్‌ప్రీత్‌సింగ్‌లు నటిస్తున్న 'రారండోయ్ వేడుక చూద్దాం' రిలీజ్ కానుంది. మొత్తానికి ఇది ఆరోగ్యకరమైన పోటీ అనే చెప్పాలి.