'బ్రహ్మూెత్సవం' డిజాస్టర్ కావడంతో ఎలాగైనా తొందరగా తన అభిమానులను మెప్పించాలని టాలీవుడ్ సూపర్‌స్టార్ భావించాడు. ఈసారి ఒకేసారి కోలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వాలని డిసైడ్ అయి మురుగదాస్‌కి పచ్చజెండా ఊపాడు. ఇదిగో అదిగో అంటూ ఈ చిత్రం షూటింగ్ 'సాగు'తూనే ఉంది. ఫస్ట్‌లుక్, టైటిల్ కోసమే కళ్లుకాయలు కాచేలా ఎదురుచూయించారు. చివరకు 'స్పైడర్' అని ఫిక్స్ అయ్యారు. జూన్23 నుంచి ఆగష్టు11కి వాయిదా వేయాలని డిసైడ్ అయ్యారు.
మరో వైపు అజిత్ 'వివేగం', సూర్య 'దృవనక్షత్రం'లు కూడా అదే రేసులోకి వచ్చాయి. ఇక ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికీ హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడలో పోలీస్ క్యాంపు ఆఫీసుల్లో చిత్రీకరిస్తున్నారు. మరోవైపు దానయ్య నిర్మాతగా 'శ్రీమంతుడు' తర్వాత మహేష్‌ను మరో సినిమాకి ఒప్పించిన కొరటాల శివ 'భరత్ అనే నేను' టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసి స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి రెండు నెలల నుంచి ఎదురుచూపులు చూస్తున్నాడు.
దీంతో 'స్పైడర్' చిత్రానికి మహేష్.. మురుగదాస్‌కి రెండు వారాల డెడ్ లైన్ పెట్టాడట. ఇక అన్నీ కుదిరితే మే 18న కొరటాల చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించే అవకాశాలున్నాయి. హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానిని ఎంపిక చేశారట. ఇక తన సెంటిమెంట్ ప్రకారం కొరటాల శివ ఈ చిత్రం ఫుల్‌స్క్రిప్ట్‌ను శ్రీవేంకటేశ్వరస్వామి పాదాల చెంత ఉంచి తన మొక్కును తీర్చుకోనున్నాడని సమాచారం