Advertisement
Google Ads BL

మిణుకు మిణుకుమంటోన్న 'నక్షత్రం'..!


క్రియేటివ్‌ జీనియస్‌ కృష్ణ వంశీకి స్పెషల్‌గా ఎందరో అభిమానులున్నారు. ఆయన చిత్రాలలో ఎవరు నటిస్తున్నారు? మిగిలిన విషయాలను పట్టించుకోకుండా ఆయన సినిమాలను చూస్తారు. 'గులాబి, నిన్నేపెళ్లాడతా, సింధూరం, ఖడ్గం' ఇలాంటి చిత్రాలను ఎవరైనా తీయగలరా? అనే రేంజ్‌లో ఆయన తన క్రియేటివీని చూపించాడు. 'మురారి, గోవిందుడు అందరివాడేలే, చంద్రలేఖ, రాఖి' వంటి చిత్రాలు జస్ట్‌ ఓకే అనిపించుకున్నాయి. 

Advertisement
CJ Advs

వాస్తవానికి ఆయనకు 'ఖడ్గం' తర్వాత ఆ స్థాయి చిత్రం రాలేదు. 'మహాత్మా'తో సహా 'చందమామ' ఫర్వాలేదనిపించింది. ఇక తాజాగా ఆయనకు బాలకృష్ణతో 'రైతు' చేసే అవకాశం వచ్చినా అది కార్యరూపం దాల్చలేదు. దీంతో ఆయన అభిమానులు నిరాశగా ఉన్నారు. కాగా ఆయన చాలా కాలం కిందట మొదలుపెట్టిన 'నక్షత్రం' చిత్రంపై ఎన్నో నెగటివ్‌ వార్తలు వచ్చాయి. సినిమా ఆలస్యం కావడమే దానికి కారణం. ఇక తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ విడుదలైంది. 

ఈ చిత్రంలో సందీప్‌కిషన్‌, రెజీనా, ప్రగ్యాజైస్వాల్‌లతో పాటు సాయి ధరమ్‌ తేజ్‌ కూడ నటిస్తుండటం విశేషం, మరోసారి కృష్ణ వంశీ 'ప్రేమ, పోలీస్‌, దేశభక్తి' అంటున్నాడు. రెజీనాను నేటి రమ్యకృష్ణతో పోల్చాడు. కాగా కృష్ణవంశీకి పాటలు తీయడంలో భలే మంచి పేరుంది. దానికి తగ్గట్లుగానే 'నక్షత్రం' ట్రైలర్‌ విజువల్స్‌ ఉన్నాయి. మొత్తానికి కృష్ణవంశీ ఈ చిత్రంతోనైనా గాడిన పడతాడో లేదో చూడాలి...! 

Krishna Vamsi Total Hopes on Nakshatram movie:

Creative Genius Krishna Vamsi has special fans. He had a lot of negative news on the 'Nakshatram' film that he started long ago. Recently Nakshatram film Trailer Releasing.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs