Advertisement
Google Ads BL

హీరోయిన్ కోసం విక్రమ్ త్యాగం..!


టాలీవుడ్, కోలీవుడ్ లలో కీర్తి సురేష్ హవా మాములుగా నడవడంలేదు. కీర్తి సురేష్, సినిమా ఇండస్ట్రీలోకి కాలు పెట్టి చాలా తక్కువ రోజులే అయినప్పటికీ ఆమె నటించిన సినిమాలన్నీ హిట్ అవడంతో ఆమెకు ఎనలేని కీర్తిప్రతిష్టలు వచ్చేశాయి. అందుకే ఇప్పుడు రాబోయే సినిమాలో కీర్తి సురేష్ ని మాత్రమే హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకుంటున్నారు స్టార్ హీరోలందరూ. ఇక ఇప్పుడు కీర్తి సురేష్ కి డేట్స్ లేకపోయినా కూడా ఆమె కోసం ఒక హీరోగారు తన డేట్స్ ని అడ్జెస్ట్ చేసాడనే విషయం అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ లో హైలెట్ అయ్యింది.

Advertisement
CJ Advs

ఆ హీరో మరెవరో కాదు 'అపరిచితుడు, నాన్న' వంటి డిఫరెంట్ సినిమాలతో అలరించిన చియాన్ విక్రమ్. చియాన్ విక్రమ్ హీరోగా డైరెక్టర్ హరి డైరెక్షన్ లో  'సామి 2' చిత్రం త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లబోతుంది. ఈ సినిమాకి హీరోయిన్ గా కీర్తి సురేష్ ని ఫైనల్ చెయ్యగా ఆమె డేట్స్ అడ్జెస్ట్ చేసే పరిస్థితుల్లో లేకపోవడంతో విక్రమ్ స్వయంగా కీర్తి కోసం తన డేట్స్ అడ్జెస్ట్ చేసుకున్నాడట. మరి కీర్తికున్న క్రేజ్ చూసి 'సామి' టీమ్ సభ్యులు ఇలా ఆమె కోసం అంతలా వెయిట్ చేస్తున్నారన్నమాట. ఇకపోతే మరోవైపు విక్రమ్ కి ఈ మధ్యన సరైన హిట్స్ లేక అటు తెలుగులో ఇటు తమిళంలో డీలా పడ్డాడు. ఇక ఇప్పుడు 'సామి 2' చిత్రాన్ని ఏకకాలంలో తెలుగు తమిళంలో విడుదల చేద్దామని సామి టీమ్ భావించ బట్టే కీర్తిని హీరోయిన్ గా ఎంపిక చేశారని చెబుతున్నారు.

ఇప్పుడు కీర్తికి తెలుగులో మంచి డిమాండ్ వుంది. అటు తమిళ్ లో కూడా సూపర్ స్పీడ్ తో దూసుకుపోతుంది. అందుకే కీర్తిని హీరోయిన్ గా తీసుకుంటే రెండు భాషల్లో 'సామి 2' కి మంచి క్రేజ్ వస్తుందని భావించి కీర్తి కోసం విక్రమ్ తన డేట్స్ అడ్జెస్ట్ చేసుకున్నాడని అంటున్నారు. 

Chiyaan Vikram Dates Adjusted for Keerthi Suresh:

Keerthy Suresh has now grabbed another interesting subject. Keerthy Suresh is going to be seen with Vikram. The film is Saamy 2.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs