దాదాపు ఐదేళ్లు బాహుబలి కోసం కష్టపడిన ప్రభాస్ ఆ సినిమాకు గాను ఓ... అన్నంత పారితోషకాన్ని అందుకోలేదు. కాకపోతే బాహుబలికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు. ఇక అందులో నటించిన నటీనటులకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు వచ్చేశాయి. అందరికన్నా ఎక్కువ పేరొచ్చింది మాత్రం డైరెక్టర్ రాజమౌళికి. ఇక రాజమౌళితో పాటే ప్రభాస్ కి మంచి పేరొచ్చింది. అందుకే ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్టుని ప్రభాస్ బాలీవుడ్ తో సహా తెలుగు, తమిళంలో తెరకెక్కిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో యువీ క్రియేషన్స్ వారు సాహో చిత్రాన్ని సుజిత్ డైరెక్షన్ లో భారీ లెవల్లో తెరకెక్కిస్తున్నారు.
మరి బాహుబలి మొదటి పార్ట్ కి ప్రభాస్ 7 కోట్ల పారితోషకం అందుకోగా బాహుబలి ద కంక్లూజన్ కి 18 కోట్లు అందుకున్నాడు. ఇక బాహుబలి రెండు పార్టులకి కలిపి ప్రభాస్ మొత్తంగా 25 కోట్లు పారితోషకాన్ని అందుకున్నాడు. మరి ఐదేళ్ల కష్టానికి ఈ పారితోషకం చాలా తక్కువ. అయినా ప్రభాస్ మాత్రం నిర్మాతలను డిమాండ్ చెయ్యకుండా మిన్నకుండిపోయాడు. అయితే ఇప్పుడు బాహుబలితో ప్రభాస్ రేంజ్ అమాంతంగా పెరగడంతో అతని తదుపరి చిత్రానికి 30 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడనే టాక్ వినబడుతుంది.మరి బాహుబలికి వచ్చిన క్రేజ్ ని ప్రభాస్ బాగానే క్యాష్ చేసుకుంటున్నాడన్నమాట.
బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించినా ప్రభాస్ బాహుబలికి ఏమాత్రం తగ్గని ప్రాజెక్ట్ లో నటించడం వలెనే ఇంత పారితోషకాన్ని డిమాండ్ చేస్తున్నాడనే మాట కూడా వినబడుతుంది. అలాగే సుజిత్ డైరెక్షన్ లో రాబోయే ప్రభాస్ సాహో చిత్రం హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతోందని సాహో టీజర్ చూస్తుంటే తెలుస్తుంది.