Advertisement
Google Ads BL

ఉయ్యాలవాడ చిత్రంలో భల్లాల దేవ...!


చిరంజీవి 151 వ చిత్రం 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఉయ్యాలవాడ కథకి  పక్కా స్క్రిప్ట్ పరుచూరి బ్రదర్స్ రెడీ చేస్తున్నారని చెబుతున్నారు. మొన్నటి వరకు స్టోరీ డిస్కార్షన్స్ లో ఉన్న సురేందర్ రెడ్డి, రామ్ చరణ్ లు ఇప్పుడు ఈ సినిమాని పట్టాలెక్కించే పనిలో భాగంగా నటి నటుల ఎంపికపై దృష్టిసారించారట. ఈ చిత్రంలో చిరంజీవి పక్కన నటించే హీరోయిన్ కోసం పెద్ద కసరత్తే చేస్తున్నారు. చిరుకి జోడిగా బాలీవుడ్ భామను దించాలనే ప్లాన్ లో ఉన్నారట. ఇక భారీ బడ్జెట్ తో రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించే ఈ చిత్రంలో రామ్ చరణ్ చిన్ననాటి మిత్రుడు రానా కూడా ఒక ముఖ్య పాత్ర పోషించబోతున్నాడనే టాక్ వినబడుతుంది.

Advertisement
CJ Advs

రానా బాహుబలి చిత్రంలో భల్లాల దేవగా నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. భల్లాల దేవగా రానా నటనకు ఫుల్ మార్కులు పడుతున్నాయి. అలాంటి రానాని ఉయ్యాలవాడ.... చిత్రంలో నటింపచేయాలని రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నాడట. అయితే రాణాకి ఇంతవరకు ఉయ్యాలవాడ టీమ్ నుండి ప్రపోజల్ వెళ్లలేదని అంటున్నారు. అయితే రాణా బాహుబలి ప్రమోషన్స్ లో బిజీగా ఉండడం వలెనే ఈ ప్రపోజల్ రాణాకి చేరలేదని త్వరలోనే రామ్ చరణ్, రాణాని మీట్ అవుతాడని అంటున్నారు. చూద్దాం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లో రాణా నిజంగా నటిస్తే ఎలాంటి పాత్రలో కనిపిస్తాడో...!!

Rana's Crucial Role for Uyyalawada Narasimha Reddy!:

Interesting update is that Mega Power Star Ram Charan's close buddy Rana will be approached for a crucial role in the film. As we know, Rana earned enormous fame with 'Baahubali' series films. We'll get more clarity on the news soon.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs