మహేష్ - మురుగదాస్ మీద ఒక వార్త గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. మహేష్ కి మురుగదాస్ పై కోపం వచ్చిందని.... అందుకే స్పైడర్ షూటింగ్ ఆలస్యమైనదని ఆ వార్త సారాంశం. ఎప్పుడో షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ చిత్రం ఇప్పటి వరకు నిర్విరామంగా కొనసాగుతూనే వుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చెయ్యడానికి కూడా మురుగదాస్ చాలా టైం తీసుకున్నాడు. ఇక ఈ సినిమాని మొదట్లో జూన్ నెలలో విడుదల చేస్తామని చెప్పినప్పటికీ కొన్ని కారణాల వల్ల అది కాస్తా పోస్ట్ పోన్ అయ్యింది.
స్పైడర్ చిత్రం తమిళ్, తెలుగులో తెరకెక్కించడం మూలంగానే సినిమా షూటింగ్ జాప్యం జరిగిందని అన్నారు. కానీ ఇప్పుడు మురుగదాస్ వల్లే స్పైడర్ చిత్రం రిలీజ్ లేట్ అయ్యిందని.... సెట్స్ మీద ఉండగా మురుగదాస్ చాలా మార్పులు చేర్పులు చెయ్యడం వల్లే షూటింగ్ లేట్ అయ్యిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అందుకే మహేష్ కూడా మురుగదాస్ మీద గుర్రుగా ఉన్నాడనే ప్రచారం మొదలయింది. అసలు స్పైడర్ చిత్రం క్లైమాక్స్ లో కూడా మురుగదాస్ కొన్ని మార్పులు చేర్పులు చెయ్యడంతో మహేష్ డేట్స్ కొన్ని కావాల్సి వచ్చాయట. అయితే మహేష్ డేట్స్ అడ్జెస్ట్ అయితే చేశాడు గాని... మురుగదాస్ పై మాత్రం కోపం తగ్గలేదని అంటున్నారు. ఎటి పరిస్థితుల్లో స్పైడర్ చిత్రం ఈ నెలాఖరుకల్లా షూటింగ్ మొత్తం కంప్లీట్ చెయ్యాలని మహేష్, మురుగదాస్ కి చెప్పనట్లు వార్తలొస్తున్నాయి.