Advertisement
Google Ads BL

నిహారిక పై సాయి ఫుల్ క్లారిటీ ఇచ్చాడు!


మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటివరకు అబ్బాయిలు మాత్రమే హీరోస్ గా ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీని ఏలుతున్నారు. కానీ గత ఏడాది మెగా ఫ్యామిలీ ఆడపిల్ల నాగబాబు కూతురు నిహారిక హీరోయిన్ గా 'ఒక మనసు' మూవీ తో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ అమ్మడు అప్పటికే గ్లామర్ ఫీల్డ్ లోకి ఎంటరై బుల్లితెర మీద యాంకరింగ్ కూడా చేసింది. ఇక తనకున్న పట్టుదలతో ఆమె హీరోయిన్ గా సినీ రంగ ప్రవేశం చేసింది. 'ఒక మనసు' సినిమాలో నాగ సౌర్యతో రొమాన్స్ చేసింది. ఆ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ హిట్ కాలేకపోయింది.

Advertisement
CJ Advs

అయితే గత కొన్ని రోజులుగా  సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ఒక వార్త ప్రముఖంగా ప్రచారం జరుగుతుంది. అదేమిటంటే మెగా ఫ్యామిలీ కూతురు నిహారిక, మెగా మేనల్లుడు సాయి ధరమ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని. నాగబాబు తన కూతురిని తన అక్క కుమారుడు సాయి ధరమ్ కిచ్చి పెళ్లి చేస్తున్నాడని.... అసలు నిహారిక, సాయి ధరమ్ చిన్నప్పటి నుండి కలిసిమెలిసి తిరుగుతూ లవ్ లో వున్నారని... ఈ ప్రేమను పెద్దలు కూడా ఒప్పుకుని పెళ్లి చేస్తున్నారని అనేక రకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక మెగా ఫ్యామిలీ వారు ఎవరూ దీనిపై స్పందించకపోయేటప్పటికి ఈ పెళ్లి విషయంలో మెగా ఫ్యాన్స్ కూడా అయోమయానికి గురయ్యారు. 

అయితే ఈ రూమర్స్ అంతటికి సాయి ధరమ్ చెక్ పెట్టేసాడు. తన మీడియా ప్రతినిధి ద్వారా ఈ విషయం పై ఫుల్ క్లారిటీ ఇచ్చేసాడు. తాను నిహారికను పెళ్లి చేసుకోవడంలేదని... తామిద్దరం చాలా మంచి స్నేహితులమని.... నిహారిక నాకు చెల్లెలి వంటిదని... మా ఫ్యామిలీ అంతా కలిసిమెలిసి ఉండడం వల్లనే ఇలాంటి రూమర్స్ వస్తున్నాయని.... ఇటువంటి రూమర్స్ నమ్మొద్దని... నిహారిక, నేను ఎప్పటికి పెళ్లి చేసుకోమని.... మేమిద్దరం మా కెరీర్స్ లో బిజీగా ఉన్నామని అఫిషియల్ గా చెప్పి మెగా పెళ్ళి రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేశాడు.

Sai Dharam Clarity on alleged marriage with Niharika:

Sai Dharam Tej is upset and has condemned baseless rumors published by some media houses about his marriage with Niharika Konidela who is like his sister. He said they are like one family from childhood and bonding between them is like brother sister. He requested media houses to please cross check facts with official sources before publishing such sensitive news especially related to a girl. Such baseless stories will hurt sentiments.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs