Advertisement
Google Ads BL

బాలీవుడ్‌ రీమేక్‌లను నమ్ముకుంటే ఎలా..?


తమిళ భాష నుంచి రీమేక్‌ చేసిన చిత్రాలలో అత్యధిక శాతం సక్సెస్‌ సాధిస్తున్నాయి. ఆచార వ్యవహారాలలో తెలుగు, తమిళ ప్రేక్షకులలో తేడాలున్నప్పటికీ ఈ రెండు రాష్ట్రాల ప్రజల అభిరుచి మాత్రం ఒకేలా ఉంటుందనేది వాస్తవం. అంతేగానీ తమిళ రీమేక్‌లు తప్ప కన్నడ, మలయాళ భాషల నుంచి వచ్చిన రీమేక్‌లలో కూడా అత్యధికం సక్సెస్‌ కాలేకపోయాయి. 

Advertisement
CJ Advs

ఇక బాలీవుడ్‌కి, మనకి ఎన్నో వైవిధ్యాలున్నాయి. వారు వైవిధ్యభరితమైన చిత్రాలను, అడల్ట్‌ కామెడి ఉన్న చిత్రాలను బాగా ఆదరిస్తారు. కానీ అవి రీమేక్‌ అయినప్పుడు మాత్రం తెలుగులో పెద్ద సక్సెస్‌ కాలేదు.. కావు. సుమంత్‌ నటించిన 'నరుడా..డోనరుడా', వెంకీ, పవన్‌లు నటించిన 'గోపాల..గోపాల', వెంకీ నటించిన 'బాడీగార్డ్‌', కమల్‌హాసన్‌, వెంకటేష్‌లు కలిసి నటించిన 'ఈనాడు' వంటి ఎన్నో ఉదాహరణలున్నాయి. ఇక తాజాగా 'హంటర్‌'కు రీమేక్‌గా వచ్చిన 'బాబు బాగా బిజీ' కూడా టపా తన్నేసింది. 

ఇక 'జాలీ ఎల్‌ఎల్‌బి 2' చిత్రం బాలీవుడ్‌లో పెద్ద హట్టే. కానీ ఆ పాయింట్‌ మాత్రం ఎన్నో మార్పులు చేర్పులు చేస్తేగానీ తెలుగు ప్రేక్షకులను ఆదరించడం కష్టం. కనీసం 'గురు'లాగా, లేదా 'గబ్బర్‌సింగ్‌' లాగా తీస్తే గానీ ఈ చిత్రం పెద్దగా సక్సెస్‌ అవ్వడం కష్టమని, ఇలాంటి సెలక్షన్‌ వెంకీకి తగదని విశ్లేషకులు భావిస్తున్నారు. 

Venkatesh Eye on Another Bollywood Film Remake:

Jolly LLB 2 Telugu remake: Venkatesh may reprise Akshay Kumar’s role
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs