Advertisement
Google Ads BL

చిరు... అఖిల్ గేమ్ షో చూస్తారా..!


చిరంజీవి హోస్ట్ గా చేస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు గేమ్ షో కి సెలబ్రిటీస్ పోటెత్తుతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ స్టార్స్ అందరూ ఈ షో లో మెరుస్తున్నారు. మీలో ఎవరు కోటీశ్వరుడు షో కి భారీ సంఖ్యలో హాజరవుతున్న సెలబ్రిటీస్ తో చిరు ఎంతో క్లోజ్ గా మాట్లాడుతూ.... వారిని ప్రేక్షకులను బాగానే ఎంటర్టైన్ చేస్తున్నాడు. సెలబ్రిటీస్ పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ విషయాలను అడుగుతూ ఈ గేమ్ షోని వారితో ఆడిస్తున్నాడు. 

Advertisement
CJ Advs

 అక్కినేని అఖిల్ ఇప్పుడు తన రెండో సినిమా షూటింగ్ లో బాగా బిజీగా వున్నాడు. అయితే తాజాగా అఖిల్ మీలో ఎవరు కోటీశ్వరుడు గేమ్ షో లో అతిధిగా కనబడుతున్నాడు. బుల్లితెర స్క్రీన్ మీద చిరు, అఖిల్ లు సందడి చెయ్యబోతున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ తో సెల్ఫీకి ఫోజు ఇస్తున్న ఫోటోని ఒకటి అఖిల్ సోషల్ మీడియాలో షేర్ చేసాడు. వారిద్దరూ మీలో ఎవరు కోటీశ్వరుడు సెట్ మధ్యలో నించుని సెల్ఫీ దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

ఇక ఇక్కడ గేమ్ షో ద్వారా వచ్చిన డబ్బుతో పాటే తన  తల్లి అమల నడుపుతున్న రెడ్ క్రాస్ సంస్థకి చిరు కొంత మొత్తాన్ని  డొనేట్ చేశారని.... అందుకు చిరంజీవి గారికే కృతఙ్ఞతలు అంటూ పోస్ట్ చేశాడు అఖిల్.

Akhil with Megastar Chiranjeevi in MEK Show:

Akkineni scion Akhil had a selfie moment with Megastar Chiranjeevi. The young hero recently attended 'Meelo Evaru Koteeswarudu' game show as a contestant and had a pleasant moment with the Megastar. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs