Advertisement
Google Ads BL

పిలిచి అవకాశం ఇచ్చాడా..?


'బలుపు, పండగ చేస్కో, విన్నర్' వంటి చిత్రాలను తెరకెక్కించిన గోపీచంద్ మలినేని ఇప్పుడు చేతిలో సినిమా లేక ఖాళీ అయ్యాడు. భారీ బడ్జెట్ తో సినిమాలను తెరకెక్కిస్తున్న ఈ దర్శకుడు మాత్రం సూపర్ హిట్స్ కొట్టలేక చతికిల పడిపోతున్నాడు. కేవలం మాస్ చిత్రాలే టార్గెట్ గా సినిమాలు ప్లాన్ చేస్తున్న గోపీచంద్ కి ఇప్పుడు మాస్ మహారాజ ఒక అవకాశం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో 'బలుపు, డాన్ శీను' వంటి మాస్ చిత్రాలు వచ్చాయి. ఇక రవితేజ కూడా ప్రస్తుతానికి ప్లాపుల బాటలోనే వుండి.... ఈ మధ్యన సినిమాలకు భారీ గ్యాప్ కూడా ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఒకేసారి రెండు చిత్రాలను లైన్ లో పెట్టిన రవితేజ మూడో సినిమాని కూడా లైన్ లో పెట్టేందుకు రెడీ అవుతున్నాడు.

Advertisement
CJ Advs

మరి 'విన్నర్' వంటి భారీ డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడికి రవితేజ పిలిచి అవకాశం ఇచ్చాడంటే నమ్మకం కుదరడంలేదు. కానీ గోపీచంద్ మలినేని ఇప్పటికే ఓ  స్టోరీని రవితేజకి చెప్పి ఒప్పించాడట. ప్రస్తుతం రవితేజ ‘టచ్ చేసి చూడు’, ‘రాజా ది గ్రేట్’ రెండు సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు. ఈ మూవీస్ ఫినిష్ అయిన తరువాత గోపీచంద్ సినిమా చేయడానికి ఓకే అన్నాడట. 

Ravi Teja Give a Chance to Director and Writer Gopichand Malineni:

Gopichand Malineni, who has screened films like 'Balupu, Pandaga Cesco, Winner', is now in the hands of a film or a vacancy. But now it is going to be the line of Ravi Teja's third movie, which has put two films in line together. Ravi Teja give a chance to the director who give him a big disaster like 'Winner' and did not believe it. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs