Advertisement
Google Ads BL

జయహో బాహుబలి... జయహో రాజమౌళి..!


'బాహుబలి ద కంక్లూజన్' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 28 న విడుదలై ప్రభంజనం సృష్టిస్తోంది. ఒక ఇండియన్ సినిమా ఈ విధంగా ప్రపంచంలో విజయ దుంధిబి మోగించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇప్పటివరకు బాక్సాఫీస్ కలెక్షన్స్ పరంగా  హాలీవుడ్ తర్వాతి స్థానంలో బాలీవుడ్ విర్రవీగుతుంటే ఇప్పుడు ఒక టాలీవుడ్ చిత్రం ఇండియాలోని అన్ని భాషల్లో విడుదలై బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది. ఇప్పటివరకు బాలీవుడ్ హీరోలే 500  కోట్ల నుండి 800  కోట్ల క్లబ్బులో కొనసాగారు. కానీ ఇప్పుడు టాలీవుడ్ హీరో ప్రభాస్ బాలీవుడ్  హీరోలందరిని వెనక్కినెట్టి 1000  కోట్ల క్లబ్బులో నిలిచాడు.

Advertisement
CJ Advs

ఒక ఇండియన్ సినిమా  అందులోను ఒక తెలుగు సినిమా 1000 కోట్ల క్లబ్బు వంటి మైల్డ్ స్టోన్ ని చేరుకోవడం అంటే మాటలు కాదు. మరి ఆ ఫీట్ ని బాహుబలి సాధించింది. ఆఫీసియల్ గా బాహుబలి 1000 కోట్ల క్లబ్బులో చేరినట్లు బాహుబలి టీమ్ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేశారు. మరి రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రం బాక్సాఫీస్ వద్ద 1000  కోట్లు సాధించిన చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఈ రికార్డ్ ని బద్దలు కొట్టడం అనేది ఇప్పట్లో అయ్యేపనికాదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక బాహుబలి లాంగ్ రన్ లో మరిన్ని రికార్డ్స్ సొంతం చేసుకోవడానికి పరుగులు పెడుతుంది. బాహుబలి రికార్డ్స్ చూసి ఇప్పుడు బాలీవుడ్ హీరోలు తెల్లమొహం వేశారనే టాక్ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.

ఇక బాహుబలి సాధించిన ఈ 1000  కోట్ల కలెక్షన్స్ చూసి ప్రతి ఒక్క తెలుగు వాడు గర్వపడుతున్నాడు. ఇక రాజమౌళిని ఆకాశానికెత్తేస్తూ అందరూ జయహో బాహుబలి.... జయహో రాజమౌళి అంటూ నినదిస్తున్నారు.

Baahubali 2 Crosses Rs.1000 Crores Gross:

An impossible becomes possible! 'Baahubali 2' achieved a miraculous feat today. This SS Rajamouli's directorial visual spectacle breached the milestone of Rs.1000 crores gross thus made Telugu people proud. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs