Advertisement
Google Ads BL

ఫ్యాన్స్ కు థాంక్స్ చెప్పిన ప్రభాస్..!


'బాహుబలి ద కంక్లూజన్' చిత్రం విడుదలైన అన్ని చోట్ల రికార్డులు తిరగరాస్తుంది. 1000  కోట్ల క్లబ్బులో చేరిన ఇండియన్ సినిమాగా బాహుబలి రేర్ ఫీట్ సాధించింది. మరి ఇందులో నటించిన నటీనటులకు వచ్చిన పేరు ప్రతిష్టలు చూస్తుంటే మాత్రం అసూయ కలగక మానదు. బాహుబలిని తెరకెక్కించిన రాజమౌళి మన తెలుగు వాడు కావడం మనకు గర్వకారణం. ఇక ఇందులో నటించిన ప్రభాస్ బాహుబలిగా వెలిగిపోయాడు. ఆ పాత్రని ప్రభాస్ తప్ప మరెవ్వరూ చెయ్యలేరంతగా నటించి మెప్పించాడు. మరి బాహుబలి ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొన్న ప్రభాస్ ఇప్పుడెవరికి కనబడకుండా మాయమైపోయాడు. ఎక్కడో అమెరికా లో సేదతీరుతున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. 

Advertisement
CJ Advs

మరి ఐదేళ్లు బాహుబలి వంటి మహా యజ్ఞంలో నిర్విరామంగా పాల్గొన్న ప్రభాస్ బాహుబలి సినిమా విడుదల కాగానే ఒక నెల పాటు విశ్రాంతి కోసం విదేశాలకు చెక్కేయడం పెద్ద విషయం కాదు. అయితే ప్రభాస్ బాహుబలి విజయాన్ని అందించిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు, డైరెక్టర్ మిగతా టెక్నీషియన్స్ కి సోషల్ మీడియాలో కృతఙ్ఞతలు తెలిపాడు. 'బాహుబలి-2’ మూవీ ఘనవిజయం సాధించిందంటే అది మీ అభిమానం, ప్రేమ వల్లే.... మీలోని ప్రతి ఒక్కరికి నా కృతఙ్ఞతలు.. ఈ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే గాక, ఓవర్సీస్‌లోనూ మీరు చూపిన అఫెక్షన్‌కి పొంగి పోతున్నాను..... ఇది సుదీర్ఘమైన బాహుబలి జర్నీ అంటూ ఫేసుబుక్ లో పోస్ట్ చేశాడు.

ఇక బాహుబలి వంటి అపురూపమైన పాత్రకి తనని తీసుకున్నందుకుగాను రాజమౌళి గారికి జీవితాంతం రుణపడి ఉంటానని... డార్లింగ్ కి థాంక్స్ చెప్పాడు. 

Prabhas Thanked Fans Through Facebook:

'To All My Fans , a big hug to each one of you for all the love that you'll have showered on me.  A big thank you to SS Rajamouli sir for believing in me to carry his huge vision to the masses, giving me a once-in-a-lifetime character of Baahubali and making the entire journey so special', posted Prabhas via his facebook page.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs