అల్లు అర్జున్ 'డీజే ... దువ్వాడ జగన్నాథం' చిత్రాన్ని హరీష్ శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటూనే ఆ మధ్యన కొద్దిగా గ్యాప్ ఇచ్చింది. డీజే చిత్రాన్ని ఈ మే నెలలోనే విడుదల చెయ్యాలని అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల అది కాస్త పోస్ట్ అయ్యింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ బ్రాహ్మణుడి లుక్ లో అదరగొడుతున్నాడు. అలాగే మొన్నామధ్యన ఒక స్టైలిష్ లుక్ లో ఉన్న అల్లు అర్జున్ పోస్టర్ ని కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్. పూజ హెగ్డే మొదటి సారి బన్నీకి జోడిగా నటిస్తున్న ఈ చిత్ర హిందీ డబ్బింగ్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడుపోయినట్లు చెబుతున్నారు.
డీజే హిందీ డబ్బింగ్ హక్కులు రూ. 7 కోట్ల భారీ మొత్తానికి అమ్మినట్లు చెబుతున్నారు. ఇప్పటికే బాహుబలి 'బాలీవుడ్' బాక్స్ ఆఫీస్ పై దండెత్తగా మహేష్ 'స్పైడర్' చిత్రం హిందీ డబ్బింగ్ రైట్స్ 28 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడుపోయాయి. మరి అల్లు అర్జున్ 'డీజే' చిత్ర హిందీ డబ్బింగ్ రైట్స్ 7 కోట్లు కు అమ్ముడు పోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. మరి ఇప్పటికే టాలీవుడ్ హీరోస్ తమ చిత్రాలకు హిందీ లో కూడా డబ్ చేసి కోట్లు కొల్లగొడుతున్నారు. ఇప్పుడా లిస్ట్ లోకి బన్నీ కూడా చేరిపోయాడు.