Advertisement
Google Ads BL

వెంకీ ఏది వదిలిపెట్టడా..!


బాలీవుడ్ లో సూపర్ హిట్స్ అయిన సినిమాలను దాదాపు అన్ని భాషల్లో రీమేక్ చెయ్యడానికి హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. ఆ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని మెప్పిస్తుంది అంటే ఆ సినిమా రీమేక్ కి వెనుకాడడం లేదు స్టార్  హీరోలు. ఇప్పటికే బాలీవుడ్ సూపర్ హిట్స్ చిత్రాలను తెలుగులో రీమేక్ చేసి మన తెలుగు హీరోలు హిట్స్ కొట్టారు. ఈ మధ్య కాలంలో వచ్చిన  'గబ్బర్ సింగ్, బాడీ గార్డ్, గోపాల గోపాల, ధృవ , గురు' వంటి చిత్రాలు ఈ కోవలోకే వస్తాయి. ఒక్క బాలీవుడ్ అనే కాదు తమిళ్ లో హిట్ అయినా, కన్నడలో హిట్ అయినా, మలయాళంలో హిట్ అయినా ఆ సినిమాలను టాలీవుడ్ డైరెక్టర్స్, నిర్మాతలు వెంటనే తెలుగులో రీమేక్ చేసేస్తుంటారు.

Advertisement
CJ Advs

ఇక తాజాగా 'ఖైదీ నెంబర్ 150 , ధృవ, గురు' చిత్రాలు కూడా ఈ లిస్టులోనే ఉన్నాయి. ఇక ఇప్పుడు అక్షయ కుమార్ నటించిన 'జాలీ ఎల్ ఎల్ బి 2' బాలీవుడ్ లో 100  కోట్ల క్లబ్ ను సాధించి సూపర్ హిట్ కొట్టింది. అయితే ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చెయ్యాలని భావిస్తున్నారట. 'జాలీ ఎల్ ఎల్ బి 2' లో అక్షయ్  కుమార్ లాయర్ గా మెప్పించాడు. ఇక ఈ చిత్ర రీమేక్ రైట్స్ నిర్మాత రాధాకృష్ణ తీసుకున్నాడని సమాచారం. హారిక హాసిని క్రియేషన్స్ పై ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తారని అంటున్నారు. అయితే ఈ చిత్రాన్ని గురు వంటి రీమేక్ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన వెంకటేష్ ఈ సినిమాలో హీరోగా నటిస్తాడని టాక్ వినబడుతుంది.

మరి ఎక్కువగా రీమేక్స్ తోనే హిట్స్ అందుకుంటున్న వెంకీ ఈ జాలీ ఎల్ ఎల్ బి 2  కూడా రీమేక్ చేస్తాడనే ప్రచారమైతే జోరుగా జరుగుతుంది.

Victory Venkatesh Remake Movie For Jolly LLB 2:

Now Akshaya Kumar's 'Jolly LLB 2' has hit the 100 hit club in Bollywood and hit a super hit. But this film is going to be remake in Telugu. But the film is hit with super hit with a remake of Guru that Venkatesh is the hero in this movie.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs