Advertisement
Google Ads BL

బన్నీ ప్లాన్ కూడా భారీగానే వుంది..!


టాలీవుడ్ హీరోస్ అందరూ ఇప్పుడు భారీ బడ్జెట్ మూవీస్ మీద కన్నేస్తున్నారు. ఇప్పటికే బాహుబలితో దుమ్ముదులుపుతున్న ప్రభాస్ తన తదుపరి చిత్రం 'సాహో' ని 150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నయువీ క్రియేషన్స్ వారికి చేస్తున్నాడు. మరోపక్క ఎన్టీఆర్ 'జై లవ కుశ' చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తన అన్న కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. మరోపక్క రామ్ చరణ్ కూడా సుకుమార్ తెరకెక్కిస్తున్నభారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రభాస్ కాకుండా మిగిలిన వారంతా 100  కోట్ల క్లబ్బులో చేరడానికి బాగా తహ తహలాడుతున్నారు.

Advertisement
CJ Advs

ఇక ఇప్పుడు అల్లు అర్జున్ కూడా వీరిలాగే ఒక భారీ బడ్జెట్ మూవీలో నటించాలని ప్లాన్ చేస్తున్నాడట. అందుకే విక్రమ్ కుమార్ కి అల్లు అర్జున్ ఒక మంచి భారీ సబ్జెక్టు ఉన్న కథను ప్రిపేర్ చెయ్యమని సూచించినట్లు వార్తలొస్తున్నాయి. విక్రమ్ కుమార్ కి అటు తమిళ్ ఇటు తెలుగుతో పాటు ఓవెర్సెస్ లో మంచి డిమాండ్ ఉండడంతో బన్నీ కి విక్రమ్ తో భారీ బడ్జెట్ చిత్రం చెయ్యాలనే ఆలోచన కలిగినట్లు చెబుతున్నారు. అందుకే 100  నుండి 140  కోట్ల మధ్యన పెట్టుపడి పెట్టె భారీ బడ్జెట్ చిత్రాన్ని బన్నీ ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం అల్లు అర్జున్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో 'డీజే' లో నటిస్తుండగా....వక్కంతం వంశీ డైరెక్షన్ లో 'నా పేరు సూర్యా..' చిత్రంలో నటించాల్సి ఉంది. అలాగే మరో క్రేజీ డైరెక్టర్ లింగు స్వామి డైరెక్షన్ లో కూడా ఒక చిత్రం కమిట్ అయిన అల్లు అర్జున్, విక్రమ్ తో ఎప్పుడు సినిమాని పట్టాలెక్కిస్తాడో చూద్దాం.

Allu Arjun Plans High Budget Movie with Vikram Kumar :

Allu Arjun Plans High Budget Movie with Manam Movie Director Vikram Kumar K. After Bunny's DJ, Vakkantham Vamsi and Lingu Swamy Films Vikram Kumar movie in the line. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs