హిట్లర్‌ను అందరూ విలన్‌గా చూడవచ్చు గానీ ఆయన ఎంతో దేశభక్తుడు. అలాగే ఎంతో మంది నియంతలుగా పేరొందిన వారు కూడా దేశం కోసం పోరాడిన వారే. ఇక తాజాగా చిన్నదేశమైన ఉత్తరకొరియా అమెరికాకు చెమటలు పట్టిస్తోంది. వరుస అణుపరీక్షలను నిర్వహిస్తోంది. అమెరికా బెదిరిస్తే బెదిరిపోమని, చచ్చే ముందు చంపే తీరుతామని, వాళ్లని నాశనం చేసే తాము నాశనం అవుతామని హెచ్చరిస్తోంది. ఇక ఉత్తరకొరియాకు చైనా మిత్ర దేశం. ఎంతో ఆప్తమిత్రువు. కానీ ఇటీవల చైనా ఆ చనువుతో అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి, అణ్వస్త్ర కార్యకలాపాలను ఆపాలని ఉత్తరకొరియాను కోరింది.
దీంతో ఉత్తర కొరియా నాయకులు, ప్రజలు తీవ్ర అవమానంగా దీనిని భావించారు. వాస్తవానికి ఉత్తరకొరియాలో చైనా బాగా వ్యాపార లావాదేవీలు నడుపుతోంది. ఉత్తరకొరియా ఆర్ధిక వ్యవస్థకు చైనా అత్యంత కీలకమైన దేశం. కానీ ఉత్తరకొరియా మాత్రం తమ దేశ వ్యవహారాలలో చైనా జోక్యం చూసి బుస్సున లేచింది. మిత్ర దేశం అని కూడా చూడం.. మీ పని మీరు చూసుకోండి. మా దేశ వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దు. అవసరమైతే మిమ్మల్ని కూడా వదులుకోవడానికి మేం సిద్దం.. అంటూ చైనాకు గట్టి వార్నింగ్ ఇవ్వడంతో బిత్తరపోవడం, సారీ చెప్పడం చైనా వంతైంది.
కాబట్టి భారత్ కూడా అమెరికా, చైనా, పాకిస్థాన్‌లను చూసి భయపడాల్సిన పనిలేదు. కాశ్మీర్‌లో ప్రతి శుక్రవారం రణరంగం జరుగుతోంది. ప్రార్ధనా స్థలాలకు వచ్చే జనాలు అక్కడి భద్రతా సిబ్బందిపై రాళ్లతో దాడి చేస్తున్నారు. ఇండియా జెండాలను కాల్చిపారేస్తున్నారు. మరి అలా కాశ్మీర్ చల్లదనంలో వేడిని రగిలించి, చలి కాచుకునే వారిని దారుణంగా అణిచివేయాలి...!