Advertisement
Google Ads BL

రామ్ చరణ్ గిఫ్ట్ ఎలా ఉందో చూశారా!


రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మొన్నటివరకు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న రామ్ చరణ్ కొత్త చిత్రం ఇప్పుడు చిరంజీవి సొంత జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ చిత్రంలో రామ్ చరణ్ కి జోడిగా నటిస్తున్న సమంత ఎండ తీవ్రత వల్ల ఇబ్బంది పడడంతో ఇంకా...  వడగాలులు కూడా ఎక్కువగా ఉండడంతో సుకుమార్ కూడా షూటింగ్ కి కొంత బ్రేక్ ఇచ్చాడు. దాదాపుగా ఈ మే నెల అంతా షూటింగ్ కి బ్రేక్ ఇవ్వొచ్చని చెబుతున్నారు.

Advertisement
CJ Advs

అయితే అక్కడ షూటింగ్ జరుపుకుంటున్నప్పుడు రామ్ చరణ్ కి అక్కడ ఫ్యాన్స్ ఒక మరిచిపోలేని బహుమతిని కానుగా ఇచ్చారు. భీమవరం పరిసర ప్రాంతాల్లో కోడి పందేలు బాగా జోరుగా జరుగుతుంటాయి. అసలు కోడిపందేలకు భీమవరం పరిసర ప్రాంతాలు బాగా  ఫ్యామస్. అందుకే అక్కడి రామ్ చరణ్ వీరాభిమానులు రామ్ చరణ్ కి ఒక కోడిపుంజును కానుకగా ఇచ్చారు. ఇక ఆ పుంజును రామ్ చరణ్ హైదరాబాద్ తీసుకొచ్చి భద్రంగా తన ఫామ్ హౌస్ లో పెట్టుకుని పెంచుకుంటున్నాడు.

ఇప్పుడా విషయాన్ని ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసింది. రామ్ చరణ్ తోపాటు ఆ కోడి పుంజు ఉన్న ఫోటో ని షేర్ చేస్తూ చరణ్ కొత్త పెట్ కోడిపుంజు అంటూ టాగ్ లైన్ యాడ్ చేసింది. 

Ram Charan Has got New Gift From Bhimavaram Fans:

The die hard fans of Bhimavaram presented Ramcharan with a cock, as the area is pretty famous for cock-fights. Charan brought it to Hyderabad and kept it in his farm house.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs